రంగమార్తాండ.. ఒకప్పుడు విలక్షణ చిత్రాలతో తెలుగు సినిమాను గొప్ప మలుపు తిప్పిన టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి వచ్చిన కొత్త చిత్రం. విడుదలకు కొన్ని రోజుల ముందునుంచే మీడియా వాళ్లకు, ఫిలిం సెలబ్రెటీలకు ఈ సినిమా స్పెషల్ షోలు వేసి చూపించగా.. అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. వాళ్ల మాటలు అతిశయోక్తి కాదని రిలీజ్ తర్వాత వచ్చిన టాక్‌ను బట్టి అందరికీ అర్థమైంది. సినిమా చూసిన వాళ్లందరూ ఇది మంచి సినిమా, గొప్ప సినిమా అంటున్నారు.
ట్విట్టర్లో, ఫేస్ బుక్‌లో ఈ సినిమా మీద పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సినిమా గురించి గొప్పగా విశ్లేషిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీతో పాటు నటీనటులు, టెక్నీషియన్లను కొనియాడుతున్నారు. ఐతే కృష్ణవంశీ అంటే పిచ్చి అభిమానం ఉన్న వాళ్లు, అభిరుచి ఉన్న కొంతమంది ప్రేక్షకులు మాత్రమే ఇప్పటిదాకా సినిమా చూశారు. వీరి సంఖ్య పరిమితంగానే ఉంది.
‘రంగమార్తాండ’ థియేటర్లలో ఆక్యుపెన్సీ చూస్తే సినిమా టాక్‌కు తగ్గట్లు అయితే లేదు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగట్లేదు. రిలీజ్ ముంగిట లో బజ్ వల్ల తొలి రోజు మార్నింగ్ షోలు వెలవెలబోయాయి. ఉగాది సెలవైన ఆ రోజు ఈవెనింగ్ షోలకు పర్వాలేదు. కానీ తర్వాతి రెండు రోజుల్లో వసూళ్ల పరంగా ఆశించిన పెరుగుదల కనిపించలేదు. వీకెండ్‌కు సినిమా బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుందని ఆశిస్తున్నారు.
సినిమా గురించి గొప్పగా వింటున్న ప్రేక్షకులు.. ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకుంటే ఒక మంచి చిత్రానికి అన్యాయం చేసినట్లే. మంచి సినిమాలు రావట్లేదని నిట్టూరుస్తూ.. అలాంటివి వచ్చినపుడు థియేటర్లకు వెళ్లి ప్రోత్సహించడం, మంచి వసూళ్లు అందించి ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చేలా చూడటం అవసరం. ‘రంగమార్తాండ’కు ఆ రకమైన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…