ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న నాని దసరా కోసం విపరీతమైన ఆసక్తి నెలకొంది. సంక్రాంతి అయ్యాక సుమారు రెండున్నర నెలల తర్వాత టాలీవుడ్ కో నిఖార్సైన మాస్ సినిమా వస్తోందని, కనక వర్షం ఖాయమని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. హైప్ కూడా క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మొన్నటి నుంచే పెట్టినా త్వరగా సోల్డ్ అవుట్ దిశగా దూసుకెళ్తున్నాయి. హైప్ ని కనక సరిగ్గా నిలబెట్టుకుంటే ఓపెనింగ్స్ రికార్డులు ఖాయం. దాస్ కా ధమ్కీనే 8 కోట్లు దాటగా లేనిది పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దసరా ఊచకోత మాములుగా ఉండదు.
తెలంగాణలో బొగ్గుగనుల నేపథ్యంతో ఒక ఊరిలో జరిగే సంఘటనల ఆధారంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరాని రూపొందించారు. ధరణి ప్రాణ స్నేహితుడు సూరిగా కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టికి చాలా ప్రాధాన్యం ఉంటుందట. ఈ క్యారెక్టర్ కి ఇచ్చే ట్విస్టు వల్లే సెకండ్ హాఫ్ లో నాని విలన్ల మీద ప్రతీకారంతో విరుచుకుపడే ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో వచ్చాయని వినికిడి. ప్రమోషన్లలో దీక్షిత్ ని ఎక్కువ హైలైట్ చేయకపోవడానికి కారణం ఇదే అంటున్నారు. పైగా ఈ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ లో కీర్తి సురేష్ కు సంబంధించిన మలుపు కూడా షాకింగేనట.
ఇంత ముఖ్యమైన భూమిక పోషించిన దీక్షిత్ శెట్టి ఇప్పటిదాకా శాండల్ వుడ్ లోనూ పెద్దగా సెటిల్ కాలేదు. నటించినవి కూడా తక్కువే. దియా సూపర్ హిట్ కావడం వల్ల మంచి పేరొచ్చింది. దీన్నే తెలుగులో డియర్ మేఘగా రీమేక్ చేశారు కానీ ఇతను నటించలేదు. టాలీవుడ్ డెబ్యూ రెండేళ్ల క్రితం వచ్చిన ముగ్గురు మొనగాళ్లుతో చేశాడు కానీ అది డిజాస్టర్ కావడంతో గుర్తింపు రాలేదు. ఇప్పుడీ దసరాలో నానితో సగంపైగా స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాడు కాబట్టి బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఇక్కడే అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. ఇంకో వారంలో తేలిపోతుంది చూద్దాం.
This post was last modified on March 24, 2023 3:33 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…