మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ కొరటాల శివ ఇలా వరుసగా నాలుగు చిత్రాలు టాప్ హీరోలతో చేయడం.. అవి నాలుగూ సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలుగా మారడం.. టాలీవుడ్లో ఇదొక అరుదైన రికార్డు. చాలా తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయాడాయన.
భారీ చిత్రాలతో బాక్సాఫీస్ సక్సెస్ ఎలా సాధించాలో ఔపోసన పట్టేశాడని.. ఆయనకు ఫెయిల్యూర్ అన్నదే ఉండదనే చాలామంది నమ్మారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘ఆచార్య’ దారుణాతి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. వరుసగా నాలుగు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన దర్శకుడు కాస్త తడబడి, రిజల్ట్ కొంచెం తేడా కొడితే ఓకే కానీ.. మరీ అంత పెద్ద డిజాస్టర్ ఇవ్వడం అనూహ్యం. ఇలాంటి రిజల్ట్ తర్వాత కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ అందుకుని, తిరుగులేని మార్కెట్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం సడలకుండా సినిమా చేయడం గొప్ప విషయం.
రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయిన ఈ చిత్రం ఎట్లకేలకు ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా కొరటాల శివ చాలా ఎమోషనల్‌గా, అదే సమయంలో కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. కెరీర్ బెస్ట్ ఫిలిం ఇస్తానన్నాడు. ఐతే కొరటాల ముందు ఇప్పుడు మామూలు సవాళ్లు లేవు. కొరటాల కచ్చితంగా బ్లాక్‌బస్టర్ ఇవ్వాల్సిన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఏమాత్రం తేడా రావడానికి.. చిన్న తప్పు జరగడానికి వీల్లేదు.
‘ఆచార్య’ ఫలితం తర్వాత తనేంటో చాటి చెప్పడమే కాక తనను నమ్మి సినిమా చేస్తున్న తారక్‌కు అతడి కొత్త స్టార్ ఇమేజ్‌కు తగ్గ సినిమా అందించాలి. ఇక ఇది ఏమీ చిన్నా చితకా చిత్రం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పెరిగిన తారక్ ఇమేజ్‌కు తగ్గట్లు పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న, భారీగా వీఎఫెక్స్‌తో ముడిపడ్డ సినిమా. ఈ సినిమాకేమో ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి పెట్టేశారు, షూటింగ్ ఏమో ఆలస్యంగా మొదలవుతోంది.
ఈ ఏడాది చివర్లోపే చిత్రీకరణ పూర్తి చేయాలి. పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా చేయాలి. వీఎఫెక్స్ లాంటివి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలి. ఈ సినిమాకు బడ్జెట్ పెడుతున్న వాళ్లేమో కొరటాల మిత్రుడు, తారక్ అన్నయ్య. అలాంటపుడు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలి. ఇలా కొరటాల మీద మోయలేని భారమే ఉంది. దాన్ని మోస్తూ బ్లాక్‌బస్టర్ ఇవ్వడమంటే మామూలు సవాలు కాదు.దాన్ని ఆయనెలా ఛేదిస్తాడో చూడాలి
This post was last modified on March 23, 2023 8:24 pm
టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…
నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…
ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్టయిందంటే.. ఆ చిత్రానికి కలిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు తమ చిత్రాల్లో…
వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…