నిన్న విడుదలైన దాస్ కా ధమ్కీకి మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగా జరుగుతున్న పబ్లిసిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశ్వక్ సేన్ కి సాధారణంగా కనిపించే దానికన్నా మంచి ఓపెనింగ్ ఉన్నట్టు థియేటర్ల దగ్గర కనిపించినా మరీ భీభత్సమైన హౌస్ ఫుల్స్ తో అన్ని సెంటర్లలో టికెట్లు దొరకనంతగా అయితే కాదు. పైగా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది వేరే సంగతి. ఉదయం షో నుంచే మిక్స్డ్ రియాక్షన్లు జనంలో కనిపించాయి. రివ్యూలు యావరేజ్ అన్నాయి. నెటిజెన్లు సెకండ్ హాఫ్ మీద కంప్లైంట్లు చేశారు. సో మొత్తానికి వసూళ్లు కొద్దిగా ఊగిసలాడాయి.
ఇప్పుడీ ఫిగర్లు చూస్తే విశ్వక్ సేన్ గత చిత్రాలకు ఇప్పుడీ దాస్ కా ధమ్కీకి పొంతన కనిపించడం లేదు. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో స్పెషల్ క్యామియో చేసినా ఓరి దేవుడాకు ఫస్ట్ డే వచ్చింది 2 కోట్ల లోపే. అశోకవనంలో అర్జునకళ్యాణం కోటిన్నరకే పరిమితమయ్యింది. పాగల్ రెండున్నర, హిట్ ది ఫస్ట్ కేస్ మూడు కోట్ల ఇరవై లక్షలు, ఫలక్ నుమా దాస్ మూడు కోట్ల దాకా మొదటి రోజు గ్రాస్ నమోదు చేశాయి. వీటికి ఎక్కడా అందనంత దూరంలో ధమ్కీ ఏకంగా 8 కోట్లు రాబట్టడం అంటే గొప్పే. ఈ లెక్కన షేర్ మూడున్నర కోట్లు దాటేసింది. దాదాపు సగం బ్రేక్ ఈవెన్ అయిపోయింది.
ఎలాగూ వీకెండ్ లో ఇంకా మూడు రోజులు ఉన్నాయి. ఇదే జోరుని కొనసాగిస్తే హిట్టు మార్కు దాటేయొచ్చు. ధమాకాకు సైతం ఇదే తరహా టాక్ వచ్చినా వంద కోట్లు దాటేసింది కాబట్టి అదే రచయిత ప్రసన్నకుమార్ రాసిన ఈ దాస్ కా ధమ్కీ సైతం మెల్లగా ఊపందుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో నిజానిజాలెంతో సోమవారం వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద ఆప్షన్లు లేవు కాబట్టి ఆడియన్స్ మొదటి ప్రయారిటీలో విశ్వక్ సేన్ సినిమానే ఉంటోంది. మరి ఈ ఛాన్స్ కనక సరిగ్గా వాడుకుంటే పెట్టిన ఓవర్ బడ్జెట్ కి న్యాయం జరిగి లాభాలు వస్తాయి.
This post was last modified on March 23, 2023 3:27 pm
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…