విజయ్ దేవరకొండ సమంతాల తొలి కలయికలో రూపొందుతున్న ఖుషి ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. గత ఏడాది సామ్ అనారోగ్యం పాలు కాకపోయి ఉంటే ఎప్పుడో డిసెంబర్ లోనే వచ్చేసేది. ఇటీవలే బ్యాలన్స్ షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు శివ నిర్వాణ బ్రేకులు లేకుండా వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు.
ఏ కోణంలో చూసుకున్నా ఖుషి చాలా తెలివైన డేట్ ని పట్టేసింది. ఎందుకంటే ఆ రోజు చెప్పుకోదగ్గ టాలీవుడ్ సినిమాలేవీ లేవు. బాలీవుడ్ మూవీ ఆకాశమే నీ హద్దురా రీమేక్ ఒకటే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనివల్ల టాలీవుడ్ మీద పడే ప్రభావం సున్నా కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి రెండు వారాల ముందు కూడా నోటెడ్ రిలీజులు ప్లాన్ చేయలేదు. ఆగస్ట్ లోనే భోళా శంకర్, జైలర్, యానిమల్ లాంటి పెద్ద మూవీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఖుషికి ఫ్రీ గ్రౌండ్ దొరికేస్తుంది. ఇప్పటికైతే టెన్షన్ లేదు కానీ ఎవరైనా చివరి నిమిషంలో ట్విస్టు ఇస్తే తప్ప.
గత ఏడాది ఆగస్ట్ లో లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఈ ఖుషి బోలెడు నమ్మకంతో ఉన్నాడు. సున్నితమైన ప్రేమకథలు చెప్పడంలో మంచి నేర్పరి అయిన శివ నిర్వాణ ఈ ఖుషిని అదే తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. మల్లువుడ్ సెన్సేషన్ హీశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇది తనకిక్కడ డెబ్యూ మూవీ. ఖుషి మ్యూజిక్ గురించి ఫీడ్ బ్యాక్ విన్నాకే నాని 30కి ఛాన్స్ ఇచ్చారనే టాక్ ఉంది. ఇక సమంతాకు యశోద ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా యూత్ హీరోల జోడిగా తాను ఇప్పటికీ పర్ఫెక్ట్ ఛాయ్సని నిరూపించుకోవడానికి ఖుషి విజయం కీలకం.
This post was last modified on March 23, 2023 5:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…