ప్రస్తుతం వరుస లైనప్ తో ఫుల్ బిజీ అయిపోయాడు రవితేజ. ‘ధమాకా’ ఇచ్చిన సక్సెస్ తో వచ్చే నెల ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావ్’ , ‘ఈగల్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత రవితేజ దర్శకుడు వీరు పోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
తొలుత వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన వీరు పోట్ల దర్శకుడిగా బిందాస్ , దూసుకెళ్తా, రగడ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కథలు రాసుకున్నాడు కానీ ఏది సెట్ అవ్వలేదు.
తాజాగా వీరు పోట్ల రవితేజకి ఓ స్క్రిప్ట్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని సమాచారం. రవితేజ కి కథ బాగా నచ్చడంతో తన లైనప్ పక్కన పెట్టి మరీ ఈ దర్శకుడికి డేట్స్ ఇస్తున్నాడని అంటున్నారు. ఈ కాంబో సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తారని తెలుస్తుంది. రవితేజ తో అనిల్ సుంకర ఎప్పటి నుండో సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఫైనల్ గా వీరు పోట్ల ప్రాజెక్ట్ తో ఇన్నాళ్ళకి మాస్ మహారాజాతో ఓ సినిమా నిర్మించబోతున్నాడు.
వీలైనంత తొందరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని రవితేజ భావిస్తున్నాడట. ఇప్పటికే వీరు పోట్ల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఘాట్ కి రెడీ అవుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on March 23, 2023 7:36 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…