రానా, చైతూ ఆ ప్రాజెక్ట్ కోసం కలిశారు

దగ్గుబాటి రానా , అక్కినేని నాగ చైతన్య ఇద్దరు కలిసి ప్రొడక్షన్ హౌజ్ పెట్టారు. ఎవరికీ తెలియకుండా ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసేశారు. అయితే ఈ ఇద్దరు కలిసింది సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. తాజాగా ఓ కొత్త బేనర్ స్టార్ట్ చేసి మాయాబజార్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయిన ఈ షో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఏ ఓటీటీ కి చేస్తున్నారు అనే డీటైల్స్ బయటికి రాలేదు కానీ తాజాగా ఓ సంస్థతో ఒప్పందం కూడా అయిపోయిందని సమాచారం.

అయితే ఈ సిరీస్ లో రానా , చైతు కనిపించరు, వీరిద్దరూ కేవలం కంటెంట్ కి ప్రొడ్యూసర్స్ మాత్రమే. రానా ఇప్పటికే వెబ్ సిరీస్ లతో ఓటీటీ లోకి దిగాడు. చైతు కూడా ధూత అనే సిరీస్ చేశాడు అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రానా ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు. చైతు నిర్మాతగా ఇదే మొదటి ప్రాజెక్ట్.

త్వరలోనే దగ్గుబాటి హీరో , అక్కినేని హీరో ఇద్దరు తమ ప్రొడక్ట్ ‘మాయాబజార్ ‘ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి నిర్మాతలుగా ప్రమోషన్స్ తో రంగంలోకి దిగబోతున్నారు. ఈ షో గురించి మరిన్ని డీటైల్స్ త్వరలోనే బయటికి రానున్నాయి.