సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఉగాది ముంగిట నిరాశాజనకమైన మూడ్‌లో ఉన్నారు. ఈ పండక్కి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వస్తాయని కాస్త ప్రచారం జరగడంతో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇంకో రెండు నెలలకు మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలని చిత్ర బృందం ఫిక్సయినట్లు తెలుస్తోంది.
కృష్ణ మరణానంతరం వస్తున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆ రోజును ప్రత్యేకంగా మార్చాలని మహేష్ భావిస్తున్నట్లున్నాడు. కుదిరితే టీజర్ కూడా ఆ రోజు వదిలే అవకాశాలు లేకపోలేదు. మహేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి తొలి విశేషాలను తన తండ్రి జయంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మహేష్ భావించడాన్ని అభిమానులు కూడా స్వాగతించాల్సిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ విషయంలోనూ అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. ముందు ఏప్రిల్ 28కి అనుకున్న ఈ చిత్రాన్ని.. ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు తెస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొత్త డేట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కట్ చేస్తే.. ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా ‘భోళా శంకర్’ను ఆగస్టు 11కు ఖాయం చేసుకున్నారు.
తమ హీరో సినిమా ఉండగా.. చిరు పోటీకి వచ్చాడేంటి అనుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ వాస్తవం ఏంటంటే.. ఆగస్టు రేసు నుంచి మహేష్ సినిమా ఎప్పుడో తప్పుకుంది. షూటింగ్ అనుకున్నదాని కంటే చాలా లేటుగా మొదలవడంతో ఈ సినిమా దసరాకైనా వస్తుందా అన్నది డౌటే. వచ్చే ఏడాది సంక్రాంతికి రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.
This post was last modified on March 22, 2023 12:32 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…