టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. ఇలా ఫలానా ఇండస్ట్రీ అని తేడా లేదు. ప్రతి చోటా ఈ మధ్య రీమేక్ సినిమాలకు ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఒకప్పుడంటే వేరే భాషా చిత్రాల విషయంలో ప్రేక్షకులకు అంతగా యాక్సెస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు.. ఇంటర్నెట్ విప్లవం, ఓటీటీల హవా పుణ్యమా అని అందరూ అన్ని భాషల చిత్రాలనూ చూసేస్తున్నారు.
ఏదైనా ఒక భాషలో ఓ సినిమా హిట్టయినట్లు వార్తలు రాగానే వెయిట్ చేసి మరీ ఆ సినిమా చూసేస్తున్నారు. చూడని వాళ్లకు కూడా సోషల్ మీడియా పుణ్యమా అని కథంగా తెలిసిపోతోంది. ఇక రీమేక్‌లు చూడ్డానికి ఆసక్తి ఏముంటుంది? ఒకటీ అరా తప్ప చాలా వరకు రీమేక్‌లకు రిజల్ట్ తేడా కొట్టేస్తోంది.
అయినా సరే.. వీటి పట్ల మోజు తగ్గట్లేదు. హిందీలో గత కొన్నేళ్లలో ‘దృశ్యం-2’ మినహాయిస్తే ఏ రీమేక్ వర్కవుట్ కాలేదు. తెలుగు నుంచి హిందీకి వెళ్లిన జెర్సీ, హిట్ లాంటి చిత్రాలకు ఎంత దారుణమైన ఫలితం ఎదురైందో తెలిసిందే.
అయినా సరే.. ఇంకో రీమేక్‌ను రెడీ చేస్తోంది బాలీవుడ్. ఇంకా టైటిల్ ఖరారు కాని ఆ సినిమాలో హీరో అక్షయ్ కుమార్. అతను సూర్య హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘సూరారై పొట్రు’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి గత ఏడాదే వెల్లడైంది. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని హిందీలోనూ సుధ కొంగరనే డైరెక్ట్ చేస్తోంది.
ఐతే లాక్ డౌన్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ చిత్రాన్ని భాషా భేదం లేకుండా ప్రేక్షకులు విరగబడి చూశారు. అందులో సూర్య పాత్రకు, నటనకు ఫిదా అయిపోయారు. ఇలాంటి సినిమాను రీమేక్ చేయడం ఏంటని అనౌన్స్‌మెంట్ టైంలోనే ఆశ్చర్యం వ్యక్తమైంది. కానీ టీం తగ్గలేదు.
సినిమా మొదలయ్యే సమయానికి అక్షయ్ పరిస్థితి పర్వాలేదు. కానీ అతను గత ఏఢాది వ్యవధిలో డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇచ్చాడు. అతడి చివరి సినిమా ‘సెల్ఫీ’ సైతం రీమేకే. అది తుస్సుమనిపించింది. ఈ అనుభవాల తర్వాత కూడా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకుంది చిత్ర బృందం. సెప్టెంబరు 1కి రిలీజ్ ఫిక్స్ చేశారు కూడా. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేలాగే ఉంది.
This post was last modified on March 23, 2023 7:36 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…