టాలీవుడ్ కొత్త రిలీజ్‌ల కోసం వీకెండ్ వరకు ఆగాల్సిన అవసరం లేకపోయింది. వారం మధ్యలోనే ఉగాది సెలవు రావడంతో అదే రోజు రెండు కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అవి రెండూ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నవే. క్రేజ్ పరంగా చూస్తే యువ కథానాయకుడు విశ్వక్సేన్ తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ‘దాస్ కా ధమ్కీ’ ముందంజలో ఉంది.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పెర్ఫామర్‌గా గుర్తింపు సంపాదించిన విశ్వక్.. ‘ఫలక్‌నుమా దాస్’తో దర్శకుడిగా కూడా ప్రతిభను చాటుకున్నాడు. ఐతే అది రీమేక్ మూవీ. ఈసారి అతను స్ట్రెయిట్ మూవీతో మెగా ఫోన్ పట్టాడు. ఈ సినిమా ఆరంభం నుంచి యూత్‌లో మంచి క్రేజే తెచ్చుకుంది. ట్రైలర్లు చూస్తే మాస్ అంశాలకు లోటు లేని పక్కా కమర్షియల్ మూవీలా కనిపిస్తోంది. విశ్వక్ సినిమాలో అదరగొట్టినట్లే కనిపిస్తున్నాడు. నివేథా పెతురాజ్ గ్లామర్ కూడా సినిమాకు ఎసెట్ అయ్యేలా ఉంది.
ఇక ఉగాది బరిలో ఉన్న మరో సినిమా ‘రంగమార్తాండ’. ఒకప్పుడు వరుసబెట్టి క్లాసిక్స్ అందించిన సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ నుంచి వస్తున్న చిత్రమిది. చాలా ఏళ్లుగా సరైన విజయం లేని ఈ క్రియేటివ్ జీనియస్.. ఈసారి చాలా ఇష్టపడి, కష్టపడి మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’ను రీమేక్ చేశాడు. ఎన్నో అవాంతరాలను దాటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ప్రోమోలు చూస్తే ఇది ఎమోషన్లు, సెంటిమెంట్‌తో ముడిపడ్డ గాఢమైన సినిమాలా కనిపిస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఆడటం ఈజీ కాదు కానీ.. విడుదల ముంగిట స్పెషల్ ప్రివ్యూల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్.. అభిరుచి ఉన్న ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ రెండు కొత్త చిత్రాల్లో ఏది ఎంతమేర మెప్పిస్తుందో.. వేసవి సీజన్‌కు ఇవి ఎలాంటి ఆరంభాన్నిస్తాయో చూడాలి.
This post was last modified on March 22, 2023 10:34 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…