ఇదేదో వాల్తేరు వీరయ్య సినిమాలో డైలాగులా అనిపిస్తోంది కదూ. అవును కొన్నిసార్లు తెరమీద సంభాషణలు నిజ జీవితంలోనూ అన్వయించుకోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు 28 ఖచ్చితంగా ఆగస్ట్ 11న విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ బుట్టబొమ్మ ప్రమోషన్స్ టైంలోనే చాలా స్పష్టంగా చెప్పిన సంగతి అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అయినా కూడా నిజంగానే ఆ తేదీని అందుకోగలరా లేదానే దాని మీద అనుమానాలు లేకపోలేదు. కట్ చేస్తే ఫ్యాన్స్ భయపడినంతా అయ్యింది. మహేష్ మూవీ వెనుకడుగు వేయడం దాదాపు లాంఛనమే అనుకోవాలి.
ఉగాది పండగ సందర్భంగా కాస్త అడ్వాన్స్ గా భోళా శంకర్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 11కి థియేటర్లకు వచ్చేస్తుందని తమన్నా కీర్తి సురేష్ లతో కలిసున్న చిరు కొత్త పోస్టర్ ఒకటి వదిలారు. అంటే మహేష్ 28 డ్రాప్ అయినట్టే. 2024 సంక్రాంతికి షిఫ్ట్ చేశారని గత వారం రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నా ఫైనల్ గా ఇప్పుడు కన్ఫర్మేషన్ దొరికింది. అయితే చిరుకి సోలో అడ్వాంటేజ్ ఏమి దొరకలేదు. రజనీకాంత్ జైలర్ ఆ తేదీకే దింపాలని సన్ పిక్చర్స్ ప్లానింగ్ లో ఉంది. రణబీర్ కపూర్ సందీప్ వంగా యానిమల్ ఎప్పుడో లాక్ చేసుకుంది
సో భోళాశంకర్ కు పరిస్థితులు మరీ అంత అనుకూలంగా అయితే ఉండవు. తాజాగా వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతోంది. ఏదో షాపింగ్ మాల్ ప్రకటనలా డిజైన్ చేశారని, మాస్ సినిమాకు ఇదేం ప్రమోషనని సెటైర్లు వేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ హిట్ వేదాళం రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇది మొదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. మెగాస్టార్ మాత్రం ధీమాగా ఉన్నారు. వీరయ్య ఇచ్చిన సక్సెస్ కిక్ ని ఇది కొనసాగిస్తుందనే నమ్మకంతో ఉన్నారు
This post was last modified on March 21, 2023 9:05 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…