రీఎంట్రీ తర్వాత కొన్నేళ్లు నెమ్మదిగాన కనిపించాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ తర్వాత స్పీడు పెంచారు.2022 వేసవితో మొదలుపెట్టి 10 నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు మెగాస్టార్. వీటిలో ఆచార్య నిరాశపరిచినా.. గాడ్ ఫాదర్ ఓ మోస్తరుగా ఆడింది. వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ అయింది. ఈ ఊపులో తన కొత్త సినిమా మీద దృష్టిపెట్టారు చిరు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేస్తున్న భోళా శంకర్ ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు సినిమాను షెడ్యూల్ చేశారు. ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్ రిలీజ్ చేసింది భోళా శంకర్ టీం. ఇందులో చిరుతో పాటు సినిమాలో ఆయన చెల్లెలిగా కీలక పాత్ర చేస్తున్న కీర్తి సురేష్, కథానాయిక తమన్నాలతో కలిసి తెలుగుదనం, పండుగ కళ ఉట్టిపడేలా కనిపించాడు చిరు. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఈ మాస్ మసాలా సినిమాను చిరు రీమేక్ చేయడం, అందులోనూ చాలా ఏళ్లుగా లైమ్ లైట్లో లేని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడంపై మెగా అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిరు అవేమీ పట్టించుకోకుండా సినిమా చేసేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని చిరుకు సన్నిహితుడైన సీనియర్ నిర్మాత కేఎస్ రామారావుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అతను చేస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే.
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…