ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రంగమార్తాండ సినిమా. ఒకప్పుడు వరుసబెట్టి క్లాసిక్స్ అందించి, చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. మేకింగ్ దశలోనే ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఆ తర్వాత సినిమాకు బిజినెస్ జరగక మరింత ఆలస్యం తప్పలేదు.
ఐతే అన్ని అడ్డంకులనూ అధిగమించి ఉగాది రోజు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు బజ్ పెంచడం కోసం ఫిలిం సెలబ్రెటీలతో పాటు మీడియా వాళ్లకు వరుసబెట్టి ప్రిమియర్స్ వేశారు. చూసిన వాళ్లందరూ సినిమాను మెచ్చుకున్నారు. అయినా సరే సినిమాకు ఇంకా బజ్ అవసరమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఏమాత్రం థియేటర్లకు వస్తారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
రిలీజ్ ముంగిట సినిమాకు బజ్ పెంచే దిశగా ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రెగ్యులర్‌గా సినిమాలకు చేసినట్లు ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేదు. చిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టారు. అందులో కృష్ణవంశీ కాకుండా పేరున్న వ్యక్తి ఎవరూ లేరు.
సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్లో పాల్గొనలేదు. అంతే కాక రంగమార్తాండ గురించి ఆయన మీడియా వాళ్లను కలిసి ఇంటర్వ్యూలు కూడా ఏమీ ఇవ్వడం లేదు. కృష్ణవంశీతో వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్‌కు మంచి స్నేహం ఉంది.
కానీ తన ప్రమోషన్ అవసరమైన స్థితిలో ఈ విలక్షణ నటుడు హ్యాండ్ ఇచ్చేశాడు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా నటించిన రమ్యకృష్ణ, సినిమాలో తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్ర చేసిన బ్రహ్మానందం సైతం ప్రమోషన్లకు దూరంగానే ఉండటం రంగమార్తాండకు మైనస్ అవుతోంది.
This post was last modified on March 21, 2023 12:39 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…