లెజెండరీ నటులను గౌరవించుకోవడం కనీస బాధ్యత. వాళ్ళ గురించి ఏ చిన్న తప్పుడు ప్రచారమైనా సరే సోషల్ మీడియా యుగంలో చాలా దూరం వెళ్తుంది. అత్యుత్సాహంతో కొందరు చేసే పనులు కోట్ల అభిమానులకు మనస్థాపం కలిగిస్తాయి. ఇవాళ ఉదయం కోట శ్రీనివాసరావు గారు కాలం చేశారనే వార్త దావానలంలా పాకిపోయింది. ఆరు లక్షల ఫాలోయర్స్ ఉన్న ఒక ఫేస్ బుక్ పేజీలో ఇది పోస్ట్ చేయడంతో ఇంకేముంది అందరూ నిజమని నమ్మేసి, ఆర్ఐపిలు పెట్టేసి ఆయన జ్ఞాపకాలను షేర్ చేసుకోవడం మొదలుపెట్టి వైరల్ చేశారు.
దీంతో ఏకంగా పోలీసులు కోట ఇంటికి వెళ్ళిపోయి రక్షణ కల్పించడానికి సిద్ధమయ్యారు. సెలబ్రిటీలు వస్తారు కాబట్టి ముందు జాగ్రత్తగా. తీరా అక్కడ చూస్తే కోటగారు చక్కగా ఆరోగ్యంగా ఉండటం చూసి అవాక్కయ్యారు. స్వయంగా ఆయనతోనే ఒక వీడియో చెప్పించే దాకా పరిస్థితి వెళ్లిందంటే సదరు ఘనకార్యం చేసిన వాళ్ళ ఉద్దేశం నెరవేరిందనే అనుకోవాలి. పండగ ఎలా చేసుకోవాలనే ఆలోచనతో నిద్ర లేచిన కోట శ్రీనివాసరావుగారు ఇంకా దినవారి కార్యక్రమాలు మొదలుపెట్టకుండానే యాభైకి పైగా సన్నహితుల ఫోన్ కాల్స్ తో ఉక్కిరిబిక్కిరయ్యారు.
గతంలోనూ ఏంఎస్ నారాయణ, సెంథిల్ లాంటి హాస్యనటుల వల్ల ఇలాంటి ఫేక్ వార్తలే ఫ్యాన్స్ ని ఖంగారు పెట్టాయి. వయసు రిత్యా కోటగారు మునుపటి స్థాయిలో సినిమాలు చేయనప్పటికీ తన శక్తి మేరకు నచ్చిన పాత్రలు ఒప్పుకుంటున్నారు. ఇటీవలే కబ్జలోనూ భారీ మేకప్ తో ఓ సీన్ లో కనిపించారు. భోళా శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ చేయడానికి డైరెక్టర్లు ఆయన్ని అడిగారు. ఇలాంటి లక్షణంగా ఉన్న మనిషి మీద ఇంత దారుణమైన వార్త ప్రచారం చేయడానికి అసలు మనసెలా వచ్చిందని టాలీవుడ్ జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి
This post was last modified on March 21, 2023 12:38 pm
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…