సినిమా కెరీర్ కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పలేదు. సినిమాల మీద ఆశలు వదులుకుని.. వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకుని ఇక రాజకీయాల్లో అడుగు పెడదాం అనుకుని ఆ వైపు చూస్తే.. ఊహించని పరిణామం ఎదురైంది. యువగళం యాత్రలో పాల్గొన్న తొలి రోజే గుండెపోటుకు గురయ్యాడు నందమూరి తారకరత్న. ఆ తర్వాత ఆసుపత్రి పాలై మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడతను.
తారకరత్న చనిపోయాక అతడి మంచితనం, తన జీవితంలోని కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. తన భర్త గురించి కొన్ని రోజులుగా ఎమోషనల్ పోస్టులు పెడుతోంది అలేఖ్య రెడ్డి. తాజాగా ఆమె ఇలాంటి పోస్టే ఒకటి పెట్టింది. అందులో తారకరత్న ఎదుర్కొన్న సమస్యలు, మానసిక వేదన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
మన పెళ్లి తర్వాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మనం వివక్ష ఎదుర్కొన్నాం. ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగాం. నిష్క పుట్టాక మన జీవితం ఎంతో మారింది. కానీ ఏదో రకంగా ద్వేషాన్ని ఎదుర్కొన్నాం. 2019లో అద్భుతం జరిగింది. మనకు కవలలు పుట్టారు. మనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంటే బాగుంటుందని నువ్వనుకున్నావు. చివరి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు. సొంతవాళ్ల వల్లే నీ మనసుకు బాధ కలిగింది. ఎవ్వరూ దాన్ని అర్థం చేసుకోలేదు. నేను కూడా నీ బాధ తగ్గించలేకపోయా. మనం కోల్పోయిన వాళ్లు నీ చివరి చూపుకు కూడా రాలేదు. మనతో మొదట్నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్లే చివరిదాకా అండగా నిలిచారు. నీతో ఉన్నది తక్కువ సమయమే అయినా.. నేను నీ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో అలేఖ్య పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించనే చర్చ జరుగుతోంది.
This post was last modified on March 21, 2023 12:09 pm
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…