సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇంత వరకూ టైటిల్ ఫిక్స్ చేయలేదు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ సగం పైనే పూర్తయింది. కానీ ఇంత వరకూ టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. తాజాగా ఈ సినిమాకు రెండు టైటిల్స్ ఫైనల్ చేసి అందులో ఒకటి ఫిక్స్ చేయబోతున్నారు. అందులో ఒకటి క్లాస్ టైటిల్ కాగా, మరొకటి మాస్ టైటిల్ అని తెలుస్తుంది.
మహేష్ బాబు , త్రివిక్రమ్ సినిమాకి మాస్ టైటిల్ కంటే క్లాస్ టైటిల్ అయితేనే బాగుంటుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం మాస్ టైటిలే ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. వీరి కాంబినేషన్ లో మొదటి సినిమాకి ‘అతడు’ అనే క్లాస్ టైటిల్ పెట్టుకున్నారు. తర్వాత ‘ఖలేజా’ అనే మాస్ టైటిల్ తో వచ్చారు. ఇప్పుడు మహేష్ , త్రివిక్రమ్ ఏ టైటిల్ కి ఓటేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
అన్నీ కుదిరితే ఉగాదికి టైటిల్ రివీల్ చేసి అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా ఘాట్ చేస్తున్నారు. పూజ హెగ్డే , శ్రీ లీల హీరోయిన్స్ నటిస్తున్నారు.
This post was last modified on March 21, 2023 9:03 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…