Movie News

ఎన్టీఆర్ సపోర్ట్ ఉంది.. కానీ !

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘దాస్ కా ధమ్కీ’ మరో రెండ్రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ ఏరి కోరి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన కథ తీసుకొని కొన్ని మార్పులతో ఈ సినిమా చేసుకున్నాడు విశ్వక్. టీజర్ , ట్రైలర్ కొంత ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో మంచి బజ్ వచ్చింది.

ఈ సినిమా కచ్చితంగా ఆడాలని తారక్ కోరుకున్నాడు. పెద్ద హిట్ కొట్టాలని విశ్వక్ ని బ్లెస్ చేశాడు. ఎన్టీఆర్ రావడం వల్ల ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే ‘ధమ్క బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ప్రస్తుతం బుకింగ్స్ లో ధమ్కీ జోరు చూపించడం లేదు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ బిగ్గెస్ట్ ఫ్యాన్ విశ్వక్ కోసం ఇక రంగంలోకి దిగాల్సిందే. లేదంటే ఈ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమాకి తన సర్వస్వం పెట్టేశాడు విశ్వక్. తనే నిర్మాణం కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాడు. మరి పెట్టిందంతా రిటర్న్ వచ్చేస్తే కానీ ఈ యంగ్ హీరో రిలాక్స్ అవ్వడు. ఎన్టీఆర్ సపోర్ట్ ఎలాగో ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు విశ్వక్ కి తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్ గా కావాలి.

This post was last modified on March 21, 2023 7:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్యతో మళ్లీ విద్యాబాలన్?

విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…

2 hours ago

మోడీకి 75 ఏళ్లు.. రంగంలోకి ఆర్ ఎస్ ఎస్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబ‌రు 17తో 75 ఏళ్లు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 74…

3 hours ago

రాబిన్ హుడ్ బాగానే దోచాడు.. కానీ

రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…

3 hours ago

బాబు ఆలోచ‌న అద్భుతః – ఆనంద్ మ‌హీంద్ర ప్ర‌శంస‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ వ్యాపార, వాణిజ్య‌, పారిశ్రామిక వేత్త‌ల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అర‌కు కాఫీని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం…

4 hours ago

రష్మిక ఇక్కడ తప్పించుకుని.. అక్కడ ఇరుక్కుంది

గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…

4 hours ago

కేతిరెడ్డి రాజకీయం వదిలేస్తున్నారా.?

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…

5 hours ago