బోల్డ్ మూవీ అంటే.. సినిమా నిండా ముద్దులు, ఇంటిమేట్ సీన్లే ఉండాల్సిన పని లేదు. క్యారెక్టర్ల తీరు, వాటి ఆలోచన విధానం.. కథ కూడా బోల్డ్‌గా ఉండొచ్చు. ఇటీవల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌తో చక్కటి స్పందన రాబట్టుకున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఈ కోవలోనిదే. అందులో హీరో ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ.. ఎవరితో కంటిన్యూ అవ్వాలో, ఎవరిని విడిచి పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాడు.
వినడానికి ఎబ్బెట్టుగా అనిపించినప్పటికీ.. ఈ కథను కన్విన్సింగ్‌గా చెప్పి, సినిమాను వినోదాత్మకంగా మలిచి ప్రేక్షకులను మెప్పించాడు యువ దర్శకుడు రవికాంత్ పేరెపు. ఓటీటీలకు బాగా నప్పే ఇలాంటి సినిమాలు మరిన్ని టాలీవుడ్లో తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో రానున్న కొత్త చిత్రం.. లవ్ లైఫ్ అండ్ పకోడి.
బిమల్, సంచిత అనే కొత్త హీరో హీరోయిన్లతో జయంత్ గాలి అనే నూతన దర్శకుడు స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రమిది. మధుర శ్రీధర్ రెడ్డి సమర్పకుడు. రానా దగ్గుబాటి ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. సినిమా విశేషాల్లోకి వెళ్తే.. ఓపెనింగ్ డైలాగ్‌తోనే ఈ చిత్రం ఎంత బోల్డ్‌గా ఉంటుందో చెప్పేశాడు దర్శకుడు.
సినిమాకు వెళ్తామని అబ్బాయి అంటే.. ‘లెట్స్ మేక్ లవ్’ అంటూ శృంగార కార్యానికి పిలుస్తుంది అమ్మాయి. ఇక తర్వాతి సీన్లో అదే అమ్మాయి అబ్బాయిని ఉద్దేశించి నిన్నింతకుముందు ఎక్కడో చూశానే అంటే.. ఒక లైబ్రరీలో ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రొమాన్స్ చేస్తున్నపుడు అతను చూడటం ఆ అమ్మాయి చూసి ఉంటుంది.
పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకే అబ్బాయితో శృంగారంలో పాల్గొనడం చాలా పాత కాలపు ఆలోచనగా భావించే అమ్మాయి.. అమ్మాయి గతం ఎలా ఉన్నప్పటికీ తనతో ప్రేమలో పడ్డాక పెళ్లి చేసుకోవాల్సిందే అని ఆలోచించే అబ్బాయి.. వీళ్లిద్దరి మధ్య సంఘర్షణతో నడిచే కథ ఇది. సన్నివేశాలు మరీ ఘాటుగా అయితే లేవు కానీ.. కాన్సెప్ట్, పాత్రలు, డైలాగులు మాత్రం చాలా బోల్డ్‌గా ఉండి యువతను ఆకర్షించేలాగే ఉందీ చిత్రం.
This post was last modified on July 30, 2020 6:16 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…