దక్షిణాద సినిమాల్లో ఒకప్పుడు సీక్వెల్స్ ఏమాత్రం కలిసొచ్చేవి కావు. కానీ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాలతో కథ మారిపోయింది. నిజానికి ఇవి నిఖార్సయిన సీక్వెల్స్ కావు. ఒక సినిమాగా మొదలుపెట్టి.. ఆ తర్వాత రెండు భాగాలుగా మారాయి. బాహుబలి, కేజీఎఫ్ రెండో భాగాలు అసాధారణ విజయాన్నందుకోవడంతో చాలామందిలో ఇలాంటి ఆలోచనే కలిగింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ వ్యవహారం మారింది. కానీ తొలి సినిమా హిట్ అయితే రెండో చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది కానీ.. రిజల్ట్ తేడా కొడితే మాత్రం కష్టమే.
యన్.టి.ఆర్-కథానాయకుడుకు కొనసాగింపుగా వచ్చిన మహానాయుడు సినిమా పరిస్థఙతి ఎంత దారుణంగా తయారైందో తెలిసిందే. దానికి మినిమం బజ్ లేకపోయింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా పరిస్థతి ఇలాగే తయారయ్యేలా ఉంది.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కేజీఎఫ్‌ను చూసి.. అచ్చం అలాంటి సినిమానే తీసింది కబ్జ టీం. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పేలా లేదు. కన్నడేతర భాషల్లో ఈ చిత్రం తొలి రోజే వాషౌట్ అయిపోయింది. కన్నడలో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. అక్కడి ప్రేక్షకులు కూడా సినిమాను తిరస్కరించారు. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడిన కబ్జ.. ఆ తర్వాత చతికిలపడింది. మొత్తంగా సినిమా పెద్ద డిజాస్టర్ అనడంలో సందేహం లేదు. కానీ కబ్జ సినిమాను ముందే రెండు భాగాలుగా ప్లాన్ చేశారు.
ఫస్ట్ పార్ట్‌లో క్యామియో తరహా రోల్స్‌లో కనిపించిన శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్‌లకు రెండో భాగంలో ఫుల్ రోల్స్ సెట్ చేశాడు దర్శక నిర్మాత చంద్రు. కానీ ప్రేక్షకుల్లో అయితే రెండో భాగం చూసేందుకు కనీస ఆసక్తి లేదు. తొలి భాగానికే తల బొప్పి కట్టిపోయిన నేపథ్యంలో ఇక సెకండ్ పార్ట్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 20, 2023 10:58 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…