సోషల్ మీడియాలో ఉండే స్టార్ హీరోల అభిమానులు సైలెంట్‌గా ఉండలేరు. వాళ్లకు తమ హీరోలు విరామం లేకుండా సినిమాలు చేస్తుండాలి. మూణ్నాలుగు నెలలకో రిలీజ్ ఉండేలా చూసుకోవాలి. సినిమా మొదలైన దగ్గర్నుంచి అప్‌డేట్ల వర్షం కురిపిస్తుండాలి. ఐతే వాళ్ల అంచనాలను అందుకోవడం ప్రస్తుతం ఏ స్టార్ హీరోకూ సాధ్యం అయ్యే పని కాదు. ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టమైపోతోంది.
ఇక చిత్రీకరణ మొదలయ్యాక అందరి దృష్టీ సినిమా ఎంత బాగా తీయాలనే దాని మీదే ఉంటుంది తప్ప.. అప్‌డేట్ల గురించి ఆలోచించరు. కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా గొడవ గొడవ చేస్తుంటారు. అప్‌డేట్.. అప్‌డేట్ అంటూ.. ట్విట్టర్లో ఉద్యమాలు చేయడమే కాక.. తమ హీరోలు ఏదైనా వేడుకలకు వచ్చినపుడు కూడా నినాదాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను మందలించడం తెలిసిందే.
కట్ చేస్తే ఇప్పుడు ఓవైపు మహేష్ బాబు ఫ్యాన్స్, మరోవైపు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో అప్‌డేట్స్ కోసం గొడవ గొడవ చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తారని కొన్ని రోజుల ముందు ప్రచారం మొదలైంది. అది తాజాగా మరింత ఊపందుకుంది. అప్‌డేట్ వచ్చేస్తోందని.. దీని గురించి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని ఫ్యాన్స్ నానా హంగామా చేశారు ఆదివారం. తీరా చూస్తే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. దీంతో నిర్మాత, దర్శకులను టార్గెట్ చేస్తూ ట్రెండ్ మొదలుపెట్టారు. ఫ్యాన్స్ దారుణమైన బూతు మాటలు అంటున్నారు మేకర్స్‌ను.
మరోవైపు ప్రభాస్ అభిమానులేమో.. ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి ప్రమోషన్లే మొదలుపెట్టకపోవడంపై మండిపడుతున్నారు. దర్శక నిర్మాత ఓం రౌత్ మేలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. అసలే సినిమాకు బజ్ తక్కువగా, నెగెటివిటీ ఎక్కువగా ఉందని.. అలాంటిది పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడం ఏంటని అంటున్నారు. విడుదలకు మూడు నెలలు కూడా సమయం లేదని… వెంటనే టీం ప్రమోషన్లు ఆరంభించాలని వాళ్లు సూచిస్తూ ట్రెండ్ నడిపిస్తున్నారు.
This post was last modified on March 20, 2023 12:14 pm
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…