ఏ ముహూర్తంలో నిర్మాత దిల్ రాజు వేణు యెల్దెండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో, ఎలాంటి భారీ ఖర్చు లేకుండా బలంగా తీశాడో అదే ఇప్పుడు బంగారు బాతులా మారిపోయింది. విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ చిన్న సినిమా పదిహేడు రోజులకు గాను 18 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ ని నివ్వెరపరుస్తోంది. ఇందులో సింహభాగం అంటే దాదాపు 60 శాతానికి పైగా నైజామ్ నుంచి వస్తున్నదే. ఒకవేళ ఆంధ్రా నుంచి కూడా ఇదే స్థాయి స్పందన వచ్చి ఉంటే ఈ క్యాటగిరీలో ఆల్ టైం రికార్డులు దక్కేవని విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు.
నిన్న చాలా హౌస్ ఫుల్స్ పడ్డాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదాహరణకు ఆదివారం మధ్యాన్నం పూట హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కబ్జల ఆక్యుపెన్సీలు సోసోగా ఉంటే బలగం మాత్రం సింగల్ సీట్ లేకుండా మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది. టాక్ అటుఇటు ఉన్నవాటికి పోవడం కన్నా చూడని హిట్ సినిమాకు టికెట్ కొనడం ఉత్తమమని ప్రేక్షకులు భావించడం వల్లే ఈ పరిస్థితి. బిసి సెంటర్స్ లోనూ గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ఫైనల్ రన్ అయ్యేలోపు బలగం పాతిక కోట్ల గ్రాస్ ని ఈజీగా దాటుతుందనే అంచంలా నిజమయ్యేలా ఉంది.
ఈ విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. నిన్నా మొన్నటిదాకా విడుదల కోసం ఇబ్బంది రంగమార్తాండని షోలు చూపించి మరీ కృష్ణవంశీ ప్రమోట్ చేసుకుని ఫైనల్ గా ఉగాది రోజు థియేటర్లకు తెస్తున్నారు. ముందు ఓటిటికి అనుకున్న ఇంటింటి రామాయణంలోనూ బలమైన తెలంగాణ నేటివిటీ ఉండటంతో దీనికీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. త్వరలోనే డేట్లు ఫిక్స్ చేయబోతున్నారు. టెక్నాలజీ ఎంత మారినా సంప్రదాయాలు, పద్దతుల మీద సరైన రీతిలో చూపిస్తే ఆదరణ దక్కుతుందని బలగం నిరూపించిన నేపథ్యంలో ఇదే తరహాలో కథలు రాసుకుంటున్నారు రచయితలు.
This post was last modified on March 20, 2023 12:03 pm
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…