సినిమా విడుదల ముందు వరకు ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు. అదంతా ప్రమోషన్లో భాగమే. తప్పేమీ కాదు. అందరూ చేస్తారు. బాలేదని ముందే అర్థమైపోయినా ఓపెనింగ్స్ కోసమో నమ్మి కొన్న బయ్యర్ల కోసమో కొన్ని మాయ మాటలు చెప్పక తప్పదు. కానీ రిలీజయ్యాక ఈ కనికట్టు చేయలేం. ఎందుకంటే కళ్ళముందు నిజాలు పబ్లిక్ టాక్, రివ్యూలు, రిపోర్ట్స్ రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అయినా సరే నవ్విపోదురు నాకేంటి అనే రీతులో కొందరు ఫేక్ కలెక్షన్ల నెంబర్లలో మభ్యపెడుతూ ఉంటారు. మొన్న శుక్రవారం వచ్చిన కబ్జ విషయంలో ఇదే జరుగుతోంది.
భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల కబ్జ తిరస్కారానికి గురయ్యింది. అయినా సరే రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్బులో చేరిపోయామంటూ అఫీషియల్ పోస్టర్లు వదిలారు. బెంగళూరులో ఏకంగా సక్సెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఒకవేళ అంత గ్రాస్ వచ్చిందనుకున్నా అందులో షేర్ ఎంతలేదన్నా యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో ఉంటుంది. కానీ ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు అన్ని లాంగ్వేజెస్ మొత్తం కలిపినా పాతిక కోట్లు దాటి ఉండదట. అలాంటప్పుడు మరీ ఇంత వ్యత్యాసంతో వసూళ్లను చెప్పుకోవడం విమర్శలకు తావిస్తోంది.
కన్నడలోనూ కబ్జకు బ్రహ్మరథం పట్టలేదు. కాకపోతే స్టార్ ఇమేజ్ వల్ల వీకెండ్ కొన్ని సెంటర్లలో మంచి నెంబర్లు వచ్చాయి తప్పించి అక్కడి మీడియా చెబుతున్నట్టు అద్భుతాలు జరిగిపోవడం లేదు. ముఖ్యంగా కెజిఎఫ్ ని ఫాలో అవుతూ జిరాక్స్ తీసినట్టుగా కబ్జను రాసుకోవడం ప్రేక్షకుల్లో నెగటివిటీకి కారణమయ్యింది. శని ఆదివారాలు తెలుగు రాష్ట్రాల్లో కనీసం పావు వంతు ఫుల్ కానీ థియేటర్లు కోకొల్లలుగా ఉన్నాయి. ఫైనల్ కామెడీ ఏంటంటే కబ్జ 2లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చని దర్శకుడు చంద్రు ఇటీవలే ఆయన్ను కలిసిన ఫోటోని వాడుతూ కథనాలు వెలువరించడం..
This post was last modified on March 20, 2023 10:41 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…