శివశక్తి దత్తా.. కీరవాణి తండ్రిగా గుర్తింపు పొందడానికంటే ముందు రచయితగా టాలీవుడ్లో ఆయన బాగానే పాపులర్. తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఆయన జానకి రాముడు సహా పలు హిట్ చిత్రాలకు కథ అందించారు. తన కొడుకు నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కీరవాణి తన కెరీర్లో చేసిన ఎన్నో పాటలతో పోలిస్తే నాటు నాటు అంత గొప్ప పాటేమీ కాదని.. ఇందులో సంగీతం ఎక్కడుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సంగతిలా ఉంచితే.. ఒకప్పుడు వైభవం చూసిన తమ కుటుంబం.. తర్వాత సినిమాల్లో డబ్బులు పోగొట్టుకుని ఎంతటి దయనీయ స్థితిని ఎదుర్కొందో శివశక్తి దత్తా చెప్పుకొచ్చారు.
నాకు సినిమా అంటే ప్యాషన్, మేం నలుగురు అన్నదమ్ములం. మేమంతా తుంగభద్ర ప్రాంతానికి లవల వెళ్లాం. అక్కడ 16 ఏళ్ల పాటు ఉన్నాం. ఆ ప్రాంతంలో నేను 300 ఎకరాలు కొన్నాను. కానీ సినిమాల కోసం ఆ భూమి అంతా అమ్మేశా. చివరికి ఈ రోజు పూట గడవడం ఎలా అనే పరిస్థితికి వచ్చాం. ఆ సమయంలో నేను, విజయేంద్ర ప్రసాద్ కలిసి మంచి మంచి కథలు రాశాం. కొండవీటి సింహం, జానకి రాముడు లాంటి హిట్ సినిమాలకు మేం పని చేశాం.
ఐతే మేం కుదురుకోవడానికి ముందు కీరవాణి.. చక్రవర్తి దగ్గర పని చేసేవాడు. అతను తెచ్చిన డబ్బులతోనే ఇల్లు గడిచేది. కీరవాణి అంటే నాకు పంచ ప్రాణాలు. మూడో ఏటే అతడికి సంగీతం నేర్పించా. తన టాలెంట్ చూసి ఆశ్చర్యపోతుంటా. కానీ నాటు నాటు పాట నాకు అంతగా నచ్చలేదు. ఇందులో సంగీతం ఎక్కడుందన్నది నా ప్రశ్న. ఐతే ఇన్నాళ్లూ కీరవాణి చేసిన కృషికి ఈ పాటకు ఆస్కార్ రూపంలో ఫలితం దక్కిందనుకుంటున్నా అని శివశక్తి దత్తా అన్నారు.
This post was last modified on March 20, 2023 7:06 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…