Movie News

అర్జున్‌తో గొడ‌వ‌పై విశ్వ‌క్ గ‌ప్‌చుప్‌

కొన్ని నెల‌ల కింద‌ట త‌మిళ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు అర్జున్.. టాలీవుడ్ యువ న‌టుడు విశ్వ‌క్సేన్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్ట‌డం తెలిసిందే. అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించి, షూటింగ్ మొద‌ల‌య్యాక విశ్వ‌క్ వెన‌క్కి త‌గ్గ‌డం ఆయ‌న్ని తీవ్ర ఆగ్ర‌హానికి, ఆవేద‌న‌కు గురి చేసింది.

ఈ క్ర‌మంలోనే ప్రెస్ మీట్ పెట్టి విశ్వ‌క్ మీద విరుచుకుప‌డ్డారు. దీనిపై ఇంత‌కుముందు ఒక కార్య‌క్ర‌మంలో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు విశ్వ‌క్. స్క్రిప్టు విష‌యంలో సంతృప్తి చెంద‌క‌, అర్జున్‌తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చిన‌ట్లు అత‌ను చెప్పాడు.

కాగా త‌న కొత్త సినిమా ధ‌మ్కీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాను క‌లిసిన విశ్వ‌క్‌కు ఈ విష‌య‌మై ప్ర‌శ్న ఎదురైంది. అర్జున్ సినిమా నుంచి త‌ప్పుకున్నందుకుగాను పెద్ద మొత్తంలో న‌ష్ట‌ప‌రిహారం క‌ట్టాల్సి వ‌చ్చిన‌ట్లుగా వచ్చిన వార్త‌ల‌పై ప్ర‌శ్నించ‌గా విశ్వ‌క్ సూటిగా స‌మాధానం చెప్ప‌లేదు.

దాని గురించి ఇప్పుడు మాట్లాడాల‌నుకోవ‌డం లేదు. ఎందుకంటే ఆ వ్య‌వ‌హారానికి ఈ సినిమాకు సంబంధం లేదు. ఎంతోమందిపై ఉన్న గౌర‌వంతో నేను ఆ విష‌యం గురించి మాట్లాడ‌ద‌లుచుకోలేదు అని విశ్వ‌క్ అన్నాడు. ఇక ధ‌మ్కీ సినిమాకు ముందు న‌రేష్ కుప్పిలిని ద‌ర్శ‌కుడిగా అనుకుని, త‌ర్వాత త‌ప్పించ‌డం గురించి విశ్వ‌క్ స్పందిస్తూ.. ముందు ఈ సినిమాకు న‌రేష్‌నే ద‌ర్శ‌కుడిగా అన‌కున్నాం.

అత‌ను నేను క‌లిసి పాగ‌ల్ సినిమా చేశాం. ధ‌మ్కీ సినిమాకు అత‌ను న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని అనుకున్నా. కానీ క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌పుడు అత‌డి శైలికి, నా క‌థ‌కు సింక్ కాద‌నిపించింది. అందుకే నేనే డైరెక్ట్ చేయాల‌నుకున్నా. త‌న‌తో మ‌రో సినిమా చేస్తాన‌ని చెప్పాను. నాకు, అత‌డికి గొడ‌వ‌లు కానీ, వాద‌న‌లు కానీ ఏమీ జ‌ర‌గ‌లేదు. ఇందులో వివాదం ఏమీ లేదు అని విశ్వ‌క్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ధ‌మ్కీ ఈ నెల 22న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on March 19, 2023 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఎవరు బతకాలో, ఎవరు చావాలో నిర్ణయించడానికి మేం ఎవరం’

కారుణ్య మరణం…వైద్యం చేసినా బ్రతికే అవకాశం లేక చావు కోసం ఎదురు చూసే పేషెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులు…

1 hour ago

తారక్ ఫ్యాన్స్ హ్యాపీ… బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య స్నేహ భావమే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావా…

2 hours ago

ఓవర్ ఫ్లోస్ కేరాఫ్ చిరు

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…

3 hours ago

సంక్రాంతికి అది అమ్మితే హత్యాయత్నం కేసు!

సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో…

4 hours ago

శర్వా మూవీకి శకునాలు బాగున్నాయి

పండగ చివర్లో వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. ప్రీమియర్లు పడే దాకా అండర్ డాగ్ గా ఉంటూ…

4 hours ago

అంతులేని కథ… జన నాయకుడి వ్యథ

రాజకీయ రంగప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి మోక్షం ఎప్పుడో అర్థం కాక అభిమానులు…

5 hours ago