ప్రస్తుతం తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ ఒక క్లాసిక్‌లా నిలిచిపోయింది. రెండో చిత్రం ‘ఖలేజా’ థియేటర్లలో డిజాస్టర్ అయినప్పటికీ టీవీల్లో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. వీరి కలయికలో సుదీర్ఘ విరామం తర్వాత రాబోతున్న కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యంగా సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం.. ప్రస్తుతం జోరుగానే చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ సినిమా టైటిల్ గురించి ఇటీవల ఆసక్తికర చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఉగాది కానుకగా సినిమా టైటిల్; ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందన్న అంచనాలున్నాయి. ఈ లోపు శాంపిల్ కింద ఒక ఆన్ లొకేషన్ పిక్ ఒకటి షేర్ చేసింది చిత్ర బృందం. అందులో మహేష్ త్రివిక్రమ్‌లతో పాటు మలయాళ నటుడు జయరాం కూడా కనిపిస్తున్నాడు.
ఐతే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది మహేష్ బాబు లుక్కే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ లుక్ మహేష్ రెండు మూడు సినిమాలను గుర్తుకు తెస్తోంది. ఇలా మహేష్ పొడవాటి జుట్టును చక్కగా స్టైలింగ్ చేయించుకుని కనిపించింది మొదటగా ‘అతిథి’ సినిమాలో. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’లోనూ అదే జులపాల జుట్టుతో కనిపించాడు కానీ.. ‘అతిథి’లో ఉన్న రఫ్ లుక్ ఇక్కడ లేదు.
ఐతే మధ్యలో మహేష్ చేసిన ‘మహర్షి’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరకు కొంచెం గడ్డం, మీసంతో కనిపించాడు మహేష్. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సెట్ చేసుకున్న లుక్‌ను గమనిస్తే ‘అతిథి’, ‘మహర్షి’ సినిమాల రెఫరెన్స్ తీసుకున్నట్లు.. ఆ రెండు చిత్రాల లుక్స్ కలగలిపినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ లుక్‌లో మహేష్ కొత్తగా కనిపిస్తున్న మాట వాస్తవం. ఫస్ట్ లుక్‌లో మహేష్ ఇంకా పాలిష్ చేసిన లుక్‌లో కనిపించే అవకాశముంది. ఇక ఈ చిత్రానికి ‘అమ్మపాట’ సహా కొన్ని టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.
This post was last modified on March 18, 2023 7:23 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…