ఎప్పుడో 2010లో వచ్చిన అల్లు అర్జున్ వరుడు సినిమా గుర్తుందా. అప్పట్లో విపరీతమైన పబ్లిసిటీతో ఆడియన్స్ లో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ సినిమాకు దర్శకుడు గుణశేఖర్. హీరోయిన్ ని చూపించకుండా ఫస్ట్ లుక్ లాంటిది లేకుండా డైరెక్ట్ థియేటర్లలోనే చూడమని చేసిన ప్రమోషన్ బాగా వైరల్. సోషల్ మీడియా పెద్దగా లేని కాలంలోనే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ అమ్మాయి పేరు భానుశ్రీ మెహ్రా. అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ తనకు అవకాశం రాలేదు. ఏదేదో ఊహించుకున్న జనాలకు తను అంత అందంగా లేకపోవడం మైనస్ అయ్యింది.
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ భానుశ్రీ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏకంగా బన్నీని లక్ష్యంగా చేసుకుంది. కారణం ఏంటయ్యా అంటే ఈ అమ్మడు ఇటీవలే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఏవేవో వీడియోలు పెడుతోంది. టూర్లు, వ్యక్తిగత జీవితానివి కొన్ని అప్లోడ్ చేసింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. పట్టుమని అయిదు వేల సబ్స్క్రైబర్స్ కూడా లేరు. దీంతో ఏదో రకంగా కౌంట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో బన్నీ ఫ్యాన్స్ క్లబ్స్ ని ట్యాగ్ చేయడం అక్కడితో ఆగకుండా ఏకంగా హీరోని పదే పదే ప్రస్తావిస్తూ ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు చేయడం షురూ చేసింది.
దీంతో అల్లు అర్జున్ ఆమెను బ్లాక్ చేశాడు. ఆఖరికి దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రచారానికి వాడేసుకుంటోంది. ఏదో ఇలా వైరల్ కావడం వల్ల చందాదారులు పెరిగి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చి లక్షల ఆదాయం వస్తుందనే ప్లాన్ కాబోలు. అయినా అభిమానులు అంత అమాయకముగా ఉండరుగా. ఆమె ఘనకార్యాన్ని రివర్స్ లో అదే స్క్రీన్ షాట్ మంత్రం ఉపయోగించి బట్టబయలు చేస్తున్నారు. అసలే ఆ వరుడు మర్చిపోలేని గాయమని అభిమానులు ఫీలవుతుంటారు. అలాంటిది ఇప్పుడా హీరోయిన్ వచ్చి ఈ టైపు చర్యలకు పాల్పడితే ఊరుకుంటారా.
This post was last modified on March 18, 2023 5:20 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…