ధమ్కీ వేదికపై తారక్ విశ్వక్ అనుబంధం

జూనియర్ ఎన్టీఆర్ ని విపరీతంగా అభిమానించే విశ్వక్ సేన్ కోసం ప్రయాణాలు, పనులు బడలిక ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కోసం తారక్ దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మాట నిలబెట్టుకున్నాడు. ఆస్కార్ వేడుక పూర్తి చేసుకుని యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చిన రెండు రోజులకే ఈ వేడుక ఉన్నప్పటికీ ఎప్పుడో ఇచ్చిన మాట కోసం నిన్న సాయంత్రం హాజరయ్యాడు. పరస్పరం ఇద్దరూ తమ మీద ప్రేమాభిమానులను స్టేజి మీద వ్యక్తపరిచారు. విశ్వక్ లాగా దూకుడుగా ఓపెన్ గా తాను ఎప్పటికీ మాట్లాడలేనని ఆ ఎనర్జీ తనకు బాగా ఇష్టమని జూనియర్ అన్నాడు.

ఎప్పుడైనా మూడ్ బాలేనప్పుడు ఈ నగరానికి ఏమైంది చూస్తానని అందులో విశ్వక్ బాధను దిగమింగుతూ నవ్వించే యాక్టింగ్ ఆకట్టుకుందని చెప్పాడు. తర్వాత ఫలక్ నుమా దాస్ చూసి పాగల్ లో ఇష్టపడి ఇతను ఒకే జానర్ కు కట్టుబడతాడేమో అనుకుంటున్న టైంలో అశోక వనంలో అర్జున కళ్యాణం మేకోవర్ చూసి షాక్ అయ్యానని చెప్పి ఆశ్చర్యపరిచిన తారక్ ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆస్కార్ పురస్కారం గురించీ దానికి సభ్యులంతా ఎంత కష్టపడింది ప్రస్తావించాడు. విశ్వక్ సేన్ లాంటి టాలెంటెడ్ హీరోలు దర్శకత్వం చేయకూడదని మంచి ప్రతిభ కలిగిన దర్శకులకు అవకాశం ఇవ్వాలని హితవు పలికాడు

మొత్తానికి చక్కని వాతావరణంలో దాస్ కా ధమ్కీ ఈవెంట్ ముగిసింది. వచ్చే వారం 22న విడుదల కాబోతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ విశ్వక్ కి చాలా కీలకం. అసలేమాత్రం పోటీ లేదు. కాకపోతే ఆపై 30న నాని దసరా భారీ ఎత్తున వస్తుండటంతో దాన్ని కాచుకోవాలంటే ధమ్కీకి బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఆ నమ్మకమైతే టీమ్ లో కనిపిస్తోంది. ధమాకా లాంటి సినిమాలతో పోలికలను మరోసారి కొట్టిపారేస్తున్న విశ్వక్ దీనికి స్వీయ దర్శకత్వం వహించడంతో సక్సెస్ పరంగా ఒత్తిడి ఇంకొంచెం అధికంగా ఉంది. నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ధమ్కీలో హీరో పాత్ర డ్యూయల్ రోల్