హీరోగా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మాస్ ఇమేజ్ కోసమే ప్రయత్నిస్తుంటారు. ముందు క్లాస్ సినిమాలు చేసినా.. తర్వాత మాస్ ఇమేజ్ కోసం తపిస్తుంటారు. ఆ ఇమేజ్ వస్తే.. సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. టాక్ వస్తే వసూళ్ల మోత మోగుతుంది. సినిమాల బడ్జెట్లు, రెమ్యూనరేషన్లు పెరుగుతాయి. మార్కెట్ విస్తరిస్తుంది.
కానీ అక్కినేని కుర్రాడు నాగచైతన్య మాత్రం కెరీర్ ఆరంభం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా మాస్ ఇమేజ్ రావట్లేదు. అతను మాస్, యాక్షన్ సినిమాలు చేసిన ప్రతిసారీ తిరస్కారమే ఎదురవుతోంది. దీంతో తిరిగి క్లాస్ లవ్ స్టోరీల బాట పట్టి సక్సెస్ కొడుతున్నాడు. కానీ గత ఏడాది తన స్టయిల్లో చేసిన ‘థాంక్యూ’ సైతం బెడిసికొట్టేసింది. ఇలాంటి టైంలో చైతూ తిరిగి మాస్ బాట పట్టాడు.
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో చైతూ చేస్తున్న ‘కస్టడీ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ వదిలారు. అది వెంకట్ ప్రభు స్టయిల్లో డిఫరెంట్ గా సాగుతూనే మాస్ అంశాలకూ లోటు లేనట్లే కనిపించింది. చైతూ పూర్తి మాస్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. కొంచెం క్లాస్ టచ్.. వైవిధ్యం ఉండి.. మాస్‌ను జోడిస్తే కొంచెం వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
‘కస్టడీ’ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. వెంకట్ ప్రభు ఆషామాషీ దర్శకుడు కాదు కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ అతడి మీద నమ్మకం పెట్టుకోవచ్చు. తమిళంలో అతను స్టార్లతో సినిమాలు తీశాడు. తన మార్కు వైవిధ్యాన్ని అందిస్తూనే మాస్ మెచ్చేలా సినిమాలు తీశాడు. కాబట్టి చైతూకు అతను తొలి మాస్ హిట్ ఇస్తాడని ఆశించవచ్చు. ఇది కనుక తేడా కొడితే మాత్రం చైతూ ఇంకెప్పటికీ మాస్ ఇమేజ్ అందుకోలేడని ఫిక్సయిపోతారేమో జనాలు.
This post was last modified on March 17, 2023 4:12 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…