తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు కృష్ణవంశీ. తొలి చిత్రం ‘గులాబి’ మొదలుకుని.. నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ.. ఇలా క్లాసిక్స్ అందించి లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. టాలీవుడ్లో ఎంతోమంది నవతరం దర్శకులకు ఆయన ఇన్‌స్పిరేషన్. ఒకప్పుడు తెలుగులో ప్రతి హీరో కూడా కృష్ణవంశీతో ఓ సినిమా చేయాలని ఆశపడేవారు. ఆయన మాత్రం స్టార్ల కోసం వెంపర్లాడకుండా తన కథలకు ఎవరు కరెక్ట్ అనుకుంటే వారితో సాహసోపేత సినిమాలు తీశాడు. ఈ క్రమంలో కొన్ని ఘనవిజయాలు అందుకున్నాడు. కొన్ని సినిమాలు తేడా కొట్టాయి కూడా.
ఐతే ఫ్లాప్ సినిమాలు తీసినా కృష్ణవంశీకి ప్రశంసలే దక్కేవి. తర్వాతి కాలంలో ఆ సినిమాలు టీవీల్లో విశేష ఆదరణ పొందేవి. కానీ ‘చందమామ’ తర్వాత ఒక ఛట్రంలో ఇరుక్కుపోయి.. ట్రెండుకు తగ్గట్లు సినిమాలు తీయలేక వెనుకబడిపోయాడు కృష్ణవంశీ.
ఐతే చాలా గ్యాప్ తర్వాత ‘నట సామ్రాట్’ అనే మరాఠీ సినిమాను ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేశాడు కృష్ణవంశీ. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యమై.. ఎట్టకేలకు ఈ నెల 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఐతే కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాకు అస్సలు బజ్ లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించలేదు. కానీ రిలీజ్ దగ్గర పడుతుండగా.. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సినీ ప్రముఖులు, మీడియా వాళ్లకు రోజుల తరబడి స్పెషల్ ప్రివ్యూలు వేస్తున్నారు. చూసిన వాళ్లందరూ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కృష్ణవంశీ మీద గౌరవంతో వచ్చి సినిమా చూసి దాని మీద నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. ట్వీట్లు వేస్తున్నారు.
తెలుగు సినిమాకు కృష్ణవంశీ చేసిన సాయానికి.. ఇండస్ట్రీ కష్టకాలంలో ఆయన రుణం తీర్చుకుంటున్నట్లుగా ఉంది ఈ పరిణామం. ఏదైతేనేం రిలీజ్ టైంకి సినిమాకు హైప్ వచ్చి.. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చి విజయం సాధిస్తే కృష్ణవంశీకి అది గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.
This post was last modified on March 17, 2023 4:02 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…