ప్రమోషన్స్ కి కుర్ర హీరో దూరమైందుకు ?

యంగ్ హీరోల్లో నాగ శౌర్య కి కొంత ఇమేజ్ ఉంది. హిట్ , ఫ్లాప్ కి సంబందం లేకుండా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు శౌర్య. అయితే రేపు శౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నాలుగేళ్ల క్రితం మొదలై ఇప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది. తన ప్రతీ సినిమా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకున్న శౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రమోషన్స్ లో మాత్రం కనిపించడం లేదు.

స్వంత బేనర్ లో శౌర్య చేసిన ప్రీవీయస్ మూవీ ‘కృష్ణ వృంద విహారి’ సినిమాకు భారీ హడావుడి చేశాడు శౌర్య. అంతకు ముందు వరుడు కావలెను , లక్ష్య సినిమాలకు కూడా గట్టి ప్రమోషన్స్ చేశాడు. ఈవెంట్స్ , ప్రెస్ మీట్స్ , ఇంటర్వ్యూలు టూర్లు ఇలా ఎక్కడా చూసిన శౌర్య కనిపించాడు. కానీ ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కి మాత్రం ప్రమోషన్స్ విషయంలో కాస్త దూరంగానే ఉంటున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి శౌర్య పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఇలాంటి సినిమాలను రీచ్ చేయాల్సిన కాలేజీ ఈవెంట్స్ కూడా చేయలేదు. నామ మాత్రంగా కొన్ని ఇంటర్వ్యూలు , ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే హాజరయ్యాడు. దీంతో ఈ కుర్ర హీరో ప్రమోషన్స్ కి ఎందుకు దూరంగా ఉంటున్నాడని ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి రేపు ఈ సినిమాకి పాజిటిక్ టాక్ వచ్చాక ఏమైనా శౌర్య రంగంలో దిగుతాడా ? చూడాలి.