పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరం తేజ్ తో కలిసి ‘వినోదాయ సీతమ్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సెట్స్ పై ఉన్న ‘హరి హరవీరమల్లు’ ను పక్కన పెట్టి ఈ రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు పవన్. ఈ సినిమాకు గానూ పవన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని ప్రచారంలో ఉంది. తాజాగా పవన్ తన రెమ్యునరేషన్ బయటపెట్టేశాడు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాకు గానూ రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నానని పవన్ పొలిటికల్ ఈవెంట్ లో చెప్పుకున్నాడు. సినిమా పేరు చెప్పకుండా 22 రోజుల షూటింగ్ కి గానూ రోజుకి రెండు కోట్లు అందుతుందని తెలిపాడు. ఈ స్థాయి మీరిచ్చిందే అంటూ ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అయితే పవన్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కోసం 22 రోజుల డేట్స్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పవన్ ఆ సినిమా రెమ్యునరేషన్ గురించే చెప్పాడని క్లారిటీ వచ్చేసింది. మరో రెండు మూడు రోజులు కాల్షీట్ పెరిగితే పవన్ ఈ సినిమాకి 50 కోట్లు తీసుకున్నట్టే.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ సంస్థలు కలిసి పవన్ తో ఈ రీమేక్ సినిమా చేసి 100 కోట్లకి మార్కెట్ చేసే ఆలోచనలో ఉన్నారు. పవన్ రెమ్యూనరేషన్ తో కలిపి ఈ సినిమాపై డెబ్బై నుండి ఎనభై కోట్లు ఖర్చు చేయబోతున్నారు. తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఒరిజినల్ దర్శకుడినే ఈ సినిమాకు సెట్ చేశారు త్రివిక్రమ్. ఈ రీమేక్ సినిమాను పవన్ దగ్గరికి తీసుకెళ్లింది ప్రాజెక్ట్ సెట్ చేసింది అంతా త్రివిక్రమే.
This post was last modified on March 17, 2023 2:52 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…