గత ఏడాది వరుసగా రెండు డిజాస్టర్లతో నాగ చైతన్యకు పెద్ద దెబ్బే పడింది. ఫీల్ గుడ్ మూవీగా యూత్ ని ఆకట్టుకుంటుందని థాంక్ యు చేస్తే ఆడియన్స్ సారీ చెప్పారు. అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ప్యాన్ ఇండియా మార్కెట్ లో గుర్తింపు వస్తుందనుకుంటే అది మరీ అన్యాయంగా డిజాస్టర్ అయ్యింది. అందుకే ఈసారి తమిళ విలక్షణ దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభుతో చేతులు కలిపాడు. కమర్షియల్ ఫార్మాట్ లోనే ప్రయోగాలు చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి. అందుకే అనౌన్స్ మెంట్ నుంచే దీని మీద అంచనాలు మొదలయ్యాయి. ఇందాక టీజర్ లంచ్ చేశారు.
గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందని నమ్మే ఒక యువకుడు(నాగ చైతన్య) కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. వృత్తపరమైన సవాళ్లు ఎన్నో ఎదురుకుంటూ ఒక నిజం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. స్థానికంగా పలుబడి ఉన్న మాఫియా రౌడీ(అరవింద్ స్వామి)తో పాటు రాజకీయ నాయకులు పన్నే పద్మవ్యూహంలో నిజాయితీకి కట్టుబడటం ప్రాణాల మీదకు తెస్తుంది. ఒంటి మీద ఖాకీ చొక్కా ఉన్నా రాజీ పడని మనస్తత్వం ప్రమాదంలో పడేస్తుంది. ఇంతకీ ఇతని జీవితంలో కస్టడీ ఎందుకు వచ్చింది, ఎవరి కోసం ఇదంతా చేశాడనేదే స్టోరీ.
కీలకమైన ట్విస్టులు బయట పడకుండా టీజర్ ని జాగ్రత్తగా కట్ చేశారు. విజువల్స్ లో వెంకట్ ప్రభు మార్క్ యాక్షన్ కనిపిస్తోంది. హీరోయిన్ కృతి శెట్టితో సహా ఆర్టిస్టులు ఎవరిని రివీల్ చేయలేదు. అరవింద్ స్వామి ఫ్రేమ్స్ ని మాత్రమే చూపించారు. ఇళయరాజా యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతమందించిన తొలి టాలీవుడ్ మూవీ ఇది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టైలిష్ గా ఉంది. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ జీ అమరన్ ఇతర తారాగణం. కంటెంట్ ఇంతే సాలిడ్ గా ఉంటే మే 12న విడుదల కాబోతున్న కస్టడీ చైతు కెరీర్ బెస్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
This post was last modified on March 16, 2023 10:12 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…