శత దినోత్సవం.. ఈ మాట ఎత్తితే కామెడీగా చూస్తున్నారు ఈ రోజుల్లో. ఏదైనా సినిమా ఒక్క థియేటర్లో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్నా.. అది నిజమైన ఘనతగా భావించట్లేదు. పనికట్టుకుని ఆడిస్తే తప్ప మన దగ్గర ఏ సినిమా కూడా వంద రోజులు ఆడే పరిస్థితి లేదు. పెద్ద హిట్ అనిపించుకున్న సినిమాలు అతి కష్టం మీద కొన్ని థియేటర్లలో 50 రోజులు ఆడుతున్నాయంతే. ఒకప్పట్లా అర్ధశత దినోత్సవాలు, శత దినోత్సవాల సెంటర్ల గురించి గొప్పగా చెప్పుకుని.. ఆ రికార్డుల గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి.
ఇలాంటి టైంలో మన సినిమా ఒకటి ఒక దేశంలో రెండొందలకు పైగా సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం అన్నది అనూహ్యమైన విషయం. వంద రోజుల రన్నే ఊహకందని విషయం అంటే.. ఆ తర్వాత కూడా అన్ని సెంటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగుతుండటం ఇంకా ఆశ్చర్యం.
ఈ ఉపోద్ఘాతం అంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది.
గత ఏడాది నవంబర్లో జపాన్‌లో భారీ ఎత్తున ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయగా.. విడుదలైన తొలి రోజు నుంచి సంచలనం రేపుతూ సాగుతోంది. జపాన్‌లో మన లాగా రెండు మూడు వారాలకు కొత్త సినిమాలను లేపేసే ట్రెండు ఇంకా రాలేదు. మన దగ్గర ఒకప్పుడు ఉన్నట్లే అక్కడ సినిమాలకు లాంగ్ రన్ ఉంటోంది. ఐతే జపాన్‌లో లోకల్ సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘ఆర్ఆర్ఆర్’ అదిరిపోయే వసూళ్లతో ఏకంగా 200కు పైగా సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం మాత్రం అనూహ్యం.
జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘ముత్తు’ పేరిట ఉన్న 400 మిలియన్ యాన్‌ల రికార్డును కొన్ని వారాల్లోనే దాటేసిన ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పటికే వెయ్యి మిలియన్ యాన్‌ల మైలురాయిని కూడా టచ్ చేసింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ఆ దేశంలో 120 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు కూడా 202 సెంటర్లలో సినిమా ఆడుతుండటం విశేషం. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం గర్వంగా ట్విట్టర్లో ప్రకటించింది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు జపాన్‌లో మరింత డిమాండ్ కనిపిస్తోందట.
This post was last modified on March 16, 2023 2:04 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…