Movie News

‘మంచి’ సినిమా అంటున్నారు.. ఆడుతుందా?


ఈ రోజుల్లో హీరోను రాముడు మంచి బాలుడిలా చూపించి.. సందేశాలు ఇస్తూ.. మంచి మంచి విషయాలు చెబుతూ సినిమా తీస్తే చూసే ఓపిక యువ ప్రేక్షకులకు ఉండట్లేదు. హీరో క్యారెక్టర్ తేడాగా ఉండి.. వీలైతే నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండి.. సినిమా క్రేజీ క్రేజీగా నడిస్తేనే యూత్‌కు ఎక్కుతోంది. సినిమాలకు మహరాజ పోషకులు యువతే కాబట్టి వాళ్ల అభిరుచిని బట్టే సినిమాలు తీస్తుంటారు ఫిలిం మేకర్స్.

గత కొన్నేళ్ల ట్రెండును గమనిస్తే ‘అర్జున్ రెడ్డి’ మొదలుకుని ‘పుష్ప’ వరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే యువతకు ఎక్కువ నచ్చుతున్నాయి. హీరోది మంచి పాత్ర.. ఇది మంచి సినిమా అంటే బూతుల్లాగా అయిపోయాయి ఈ రోజుల్లో. ఇలాంటి ముద్ర వేయించుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటోంది. ఇలాంటి సమయంలో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఒక ‘మంచి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే.. రంగమార్తాండ.

చాన్నాళ్ల పాటు మేకింగ్ దశలో ఉండి ఎట్టకేలకు రిలీజవుతున్న ‘రంగమార్తాండ’కు ట్రేడ్ వర్గాల్లో… ప్రేక్షకుల్లో ఆశించినంత బజ్ అయితే లేని మాట వాస్తవం. ఐతే రిలీజ్ ముంగిట ఈ సినిమాను సినీ ప్రముఖులతో పాటు మీడియా వాళ్లకు వరుసబెట్టి స్పెషల్ షోలు వేస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ కృష్ణవంశీ ఈజ్ బ్యాక్ అని.. చాలా హృద్యంగా తీశారని.. ఇది మంచి సినిమా అని అంటున్నారు. సినిమా వాళ్లతో పాటు మీడియా వాళ్లు కూడా ‘రంగమార్తాండ’ గురించి పాజిటివ్ ట్వీట్లు వేసి ప్రమోట్ చేస్తున్నారు. అందరూ ముక్తకంఠంతో ఇందులోని ఎమోషన్లు, సెంటిమెంట్.. విలువల గురించి చెబుతున్నారు. కన్నీళ్లు పెట్టించే సినిమా ఇదని అంటున్నారు.

ఐతే ఇలాంటి ‘మంచి’ సినిమాలను ఇప్పటి యువత ఏమేర ఆదరిస్తారన్నదే సందేహంగా ఉంది. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానున్న ‘రంగమార్తాండ’ను కృష్ణవంశీ అభిమానులు ఎంతమాత్రం ఓన్ చేసుకుంటారు.. ఇప్పటి యువత ఈ చిత్రానికి ఎంతమేర కనెక్ట్ అవుతారు అన్నది చూడాలి.

This post was last modified on March 15, 2023 5:36 pm

Share

Recent Posts

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

14 minutes ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

1 hour ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

2 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

3 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

4 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

5 hours ago