సోషల్ మీడియాలో గత రెండు వారాలుగా విపరీతమైన చర్చకు గురైన సినిమా మలయాళం ఇరట్ట. జోజు జార్జ్ అనే క్యారెక్టర్ నటుడు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆయనే విలన్ కూడా. పోలీస్ గా పని చేసే కవల సోదరుల్లో ఒకడు హత్యకు గురైతే అదే డిపార్ట్ మెంట్ లో పై అధికారిగా ఉన్న సోదరుడు కేస్ ఇన్వెస్టిగేట్ చేయడం ఇందులో మెయిన్ పాయింట్. కాకపోతే చనిపోక ముందు శాడిస్ట్ గా ఒక పాత్రలో జోజు నటన, క్లైమాక్స్ లో ఇచ్చే మతిపోయే మలుపు చాలా కాలం వెంటాడుతూనే ఉంటుంది. రెగ్యులర్ ట్విస్టులకు భిన్నంగా మైండ్ డిస్టర్బ్ అయ్యేలా తీసిన తీరు ట్రెండింగ్ లో ఉంది
ఇప్పుడీ విలక్షణ నటుడిని టాలీవుడ్ కు పట్టుకొచ్చారు. వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న విలేజ్ డ్రామాలో ముఖ్యమైన క్యారెక్టర్ కోసం జోజు జార్జ్ ని లాక్ చేశారు. ఉప్పెన తర్వాత కొండపోలం, రంగరంగ వైభవంగా రెండు డిజాస్టర్ కావడంతో వైష్ణవ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. రొటీన్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా ఫాంటసీ టచ్ తో తీస్తున్నట్టుగా టాక్ ఉంది. కొన్నేళ్ల క్రితం మంచు మనోజ్ తో మొదలుపెట్టి ఆపేసిన అహం బ్రహ్మాస్మి డైరెక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డే. కథ మార్చారా లేక అదే తీసుకున్నారా ఇంకా తెలియలేదు
మొత్తానికి మరో టాలెంటెడ్ యాక్టర్ తెలుగుకు పరిచయం కాబోతున్నాడు. ఇతని ఘనతని కేవలం ఇరట్టా కోణంలోనే చూడకూడదు. ఆ మధ్య రాజశేఖర్ రీమేక్ చేసిన శేఖర్ ఒరిజినల్ వెర్షన్ జోసెఫ్ లో నటనకు గాను స్పెషల్ మెన్షన్ క్యాటగిరీలో జాతీయ అవార్డు సాధించాడు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఫిలిం ఫేర్ లు గట్రా చాలానే వచ్చాయి. కేవలం నాలుగేళ్ల కాలంలో ఇరవై దాకా పురస్కారాలు దక్కించుకోవడం ఈ జోజు జార్జ్ ప్రత్యేకత. ఇప్పుడు లాంచ్ కాబోయే సినిమా కనక బ్లాక్ బస్టర్ అయితే ఇక్కడా అవకాశాలు వెల్లువెత్తుతాయి. కాకపోతే అంత సులభంగా దొరకడు
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే మొన్నామధ్య సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్…
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…