ఒక హిందీ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. అందులోనూ కరోనా తర్వాత పరిస్థితి నార్త్ బాక్సాఫీస్ కు మరీ దారుణంగా మారిపోయింది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, కాంతార లాంటి సౌత్ డబ్బింగులు లేకపోతే అలో లక్ష్మణా అంటూ గగ్గోలు పెట్టాల్సి వచ్చేది. పఠాన్ దీన్ని సమూలంగా మార్చేసింది. కంటెంట్ ఎంత రొటీన్ యాక్షన్ తో ఉన్నా మాస్ కి నచ్చేలా ఒక సూపర్ స్టార్ ని చూపిస్తే కనక కనక వర్షం ఎలా కురుస్తుందో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ 1000 కోట్లను దాటించేసి మరీ నిరూపించారు.
ఈ రోజు పఠాన్ 50 రోజులను పూర్తి చేసుకుంది. అది కూడా ఆషామాషీగా కాదు. ఇవాళ్టికి దేశవ్యాప్తంగా 800 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా మరో 135 థియేటర్లలో ఆడుతూనే ఉంది. వీటిలో రెగ్యులర్ షోలు, షిఫ్టింగ్ లు అన్నీ కలిసే ఉన్నాయి. ఇది మాములు ఫీట్ కాదు. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలకే ఫిఫ్టీ డేస్ అనేది కష్టంగా మారింది. ఆస్కార్ తెచ్చిన ట్రిపులార్ సైతం కౌంట్ పరంగా ఇంత నెంబర్ తెచ్చుకోలేదు. ఆ రకంగా చూస్తే షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ ఏ స్థాయిలో పని చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో రెండు వారాలకు పైగా ఈజీ రన్ ఉంటుందని ట్రేడ్ చెబుతోంది.
ఈ జోరు కారణంగా పఠాన్ ఓటిటి స్ట్రీమింగ్ ని వాయిదా వేసుకున్నారు. ఈ వారంలోనే అనౌన్స్ మెంట్ ఉండబోతోంది. థియేటర్ లో చూసింది కాకుండా ఎడిట్ చేయని అన్ కట్ వెర్షన్ ని అమెజాన్ ప్రైమ్ లో తీసుకురాబోతున్నారు. వ్యూస్ పరంగా భారీ రికార్డులు నమోదవ్వడం ఖాయమని డిజిటల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పఠాన్ తర్వాత కొత్త రిలీజులు చాలనే వచ్చాయి కానీ అవేవి కింగ్ ఖాన్ మీద పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి. సెల్ఫీ, షెహజాదా డిజాస్టర్ కాగా తూ ఝూటి మై మక్కర్ డీసెంట్ గా వర్కౌట్ చేసుకుని లాభాలతో బయటపడేలా ఉంది.
This post was last modified on March 15, 2023 11:48 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…