ప్రస్తుతం ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ ఉంది. మార్కెట్ ను బట్టి ఎవరి ప్రమోషన్ వారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఆహా మాత్రం ఆ విషయంలో ఇంకాస్త ముందుంది. అవును ఆహా పెట్టినప్పుడు స్వంత హీరో అల్లు అర్జున్ ను , అలాగే కొంత భాగస్వామి అయిన విజయ్ దేవరకొండ ను బాగా వాడుకున్నారు. ఆహా అనే ఓటీటీ ఉందని జనాలకి రీచ్ చేయడంలో బన్నీ కీలక పాత్ర పోషించాడు. ఇక క్రాక్ సినిమాతో ఆహా ఒక్కసారిగా సబ్ స్క్రిప్షన్స్ పెంచేసుకుంది.
ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలతో బండి లాగించింది. కానీ ఎప్పుడైతే బాలయ్య టాక్ షోతో ఆహాలో ఎంట్రీ ఇచ్చాడో అక్కడి నుండి ఈ ఓటీటీ అందరికీ చేరువైంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోతో ఆహా బాగా లాభపడింది. దీంతో బాలయ్యను ఆహాకి మెల్లగా బ్రాండ్ అంబాసిడర్ చేసేశారు అల్లు అరవింద్. అన్ స్టాపబుల్ షోకి సంబంధం లేకుండా మధ్యలో బాలయ్యను సింగర్స్ షో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 కి గెస్ట్ తీసుకొచ్చారు.
తాజాగా మరోసారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కి బాలయ్యను స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చి నందమూరి హీరోతో ఓ సాంగ్ కి పెర్ఫార్మ్ కూడా చేయించారు. ఏదేమైనా బాలయ్యను ఆహా వాడుకుంటున్నట్లు మరెవరూ వాడలేరేమో. బాలయ్య అప్పిరియన్స్ తో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కి ఏ రేంజ్ వ్యూస్ వస్తాయో చూడాలి.
This post was last modified on March 14, 2023 10:16 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…