కృష్ణ వంశీ ఈ పేరు ఒకప్పుడు బ్రాండ్. ఇప్పటికీ అంతో ఇంతో క్రేజ్ ఉన్న దర్శకుడే. కానీ సక్సెస్ లేక కాస్త వెనుక బడ్డాడు. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని ఇప్పుడు రంగమార్తాండతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రకాష్ రాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించిన ఈ సినిమాను కృష్ణ వంశీ చేతిలో పెట్టడంతో ఈ సీనియర్ దర్శకుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. షూటింగ్ బ్రేకులు , కరొన ఎఫెక్ట్ , పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ , బడ్జెట్ చాలక ఇబ్బందులు , బిజినెస్ అవ్వకపోవడంతో టెన్షన్ ఇలా ఈ ఒక్క సినిమా కృష్ణ వంశీ ఓ జీవితం చూపించేసింది.
అయితే రంగమార్తాండ ను కృష్ణ వంశీ బాగా నమ్మేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడినా తప్పులేదని భావించాడు. అక్కడి నుండి మీడియా ముందుకొచ్చి ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ చేసుకున్నాడు. దర్శకుడిగా తన ఇన్ఫ్యూ లెన్స్ వాడి మీడియా పరిచయాలతో ఎంతో కొంత ప్రమోషన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా ఇండస్ట్రీలో తనకున్న గుడ్ విల్ , రెస్పెక్ట్ ను వాడుకొని ప్రముఖులందరికీ షోస్ వేస్తూ వారి ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు.
ఇంతే కాదు రంగమార్తాండ కి కృష్ణవంశీ వెనుక ఉంది ఎంతో కొంత పెట్టుబడి కూడా పెట్టె ఉంటాడని అంటున్నారు. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వంశీ బడ్జెట్ ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి ప్రీమియర్ షోల ద్వారా మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ లో ఎంతో కొంత రెవెన్యూ వస్తే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. లేదంటే కృష్ణవంశీ కష్టం అంతా వృదా అవుతుంది. ఇక నెక్స్ట్ సినిమాకి చేయలేనంతగా కృష్ణ వంశీ రంగమార్తాండ కి తన సర్వం అర్పించేశాడు. చూడాలి ఈ సీనియర్ దర్శకుడికి ఈ సినిమా ఎలాంటి డబ్బు పేరు తెచ్చి పెడుతుందో ?
This post was last modified on March 14, 2023 10:13 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…