బాలీవుడ్ డెబ్యూ కోసం ఏకంగా మూడేళ్ళ విలువైన టాలీవుడ్ కెరీర్ ని పణంగా పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఛత్రపతి హిందీ రీమేక్ కి రూట్ క్లియరైనట్టుగా తాజా సమాచారం. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా విడుదల ఎందుకు ఆలస్యమవుతూ వచ్చిందో ఎవరికీ తెలియలేదు. దీని దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉంటున్నా అప్పుడప్పుడు ఇతర అంశాల మీద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నా చతప్రతి ప్రస్తావన రాకుండా ముందే యాంకర్లకు చెప్పి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకే క్లారిటీ లేకుండా పోయింది.
ఆఖరికి ఓటిటిలో వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఫైనల్ గా మే 5 థియేటర్లలోనే తీసుకొస్తారట. ఇంత జాప్యం జరగడానికి టైటిల్ విషయంలో జరిగిన రగడే కారణమట. వేరే బాలీవుడ్ నిర్మాత ఒకరు దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకోవడం, తీరా అడిగే సమయానికి ఆయన ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేయడం ఇలాంటి పరిణామాల వల్ల నిర్మాతలు వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఈ పేరు తప్ప ఇంకేదీ సూటవ్వదని భావించిన పెన్ అధినేతలు ఫైనల్ గా ఆ మొత్తాన్ని సమర్పించుకుని దారి సుగమం చేసుకున్నారని తెలిసింది. దీనికే నెలల సమయం గడిచిపోయింది.
అంతా బాగానే ఉంది కానీ ఇంత ఖర్చు పెట్టి తీసిన ఛత్రపతికి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని టెన్షన్ యూనిట్ లో లేకపోలేదు. ఎందుకంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ ని యూట్యూబ్ లో, శాటిలైట్ ఛానల్స్ లో నార్త్ ఆడియన్స్ విచ్చలవిడిగా చూసేశారు. ఇప్పుడు ప్రభాస్ స్థానంలో సాయిశ్రీనివాస్ ని ఒప్పుకుంటారా అనేది పెద్ద భేతాళ ప్రశ్న. ఈ మీమాంస కూడా చాలా కాలం మేకర్స్ ని వెంటాడిందని ఇన్ సైడ్ టాక్. ఏదైతేనేం మొత్తానికి గుమ్మడికాయ పడిపోయింది. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ చంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లం హీరో దాన్ని అఫీషియల్ గా ప్రకటించడమొకటే బాకీ.
This post was last modified on March 14, 2023 4:25 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…