ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతున్న దసరా మీద అంచనాలు మాములుగా లేవు. తన మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ప్రమోషన్ల పరంగా నాని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అన్ని బాషల ఆడియన్స్ కి చేరువ చేసే ఉద్దేశంతో దేశం మొత్తం ప్రధాన నగరాలు తిరుగుతూ తనను తాను కొత్తగా లాంచ్ చేసుకుంటున్నాడు. మార్చి 30 మంచి డేట్ కావడంతో తమిళ హిందీ కన్నడలో చెప్పుకోదగ్గ పోటీ ఉంది. వాటికి ధీటుగా నిలబడి ఓపెనింగ్స్ సాధించుకోవాలంటే కంటెంట్ బలంగా ఉందనే సందేశం జనంలోకి వెళ్ళాలి. నాని ఇప్పుడు చేస్తున్నది అదే.
ఇక విషయానికి వస్తే కీర్తి సురేష్ దసరాలో హీరోయిన్ అయినప్పటికీ ట్విట్టర్ లో తప్ప ఇప్పటిదాకా తానుగా ముందుకొచ్చి యాక్టివ్ గా ప్రమోట్ చేసింది లేదు. దానికి కారణం ఒకటే. తను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటోంది. చిరంజీవి భోళాశంకర్ కీలక షెడ్యూల్ లో పాల్గొంటోంది. కోటి విమెన్ కాలేజీలో షూట్ జరుగుతోంది. మరికొన్ని సన్నివేశాలు సిటీలోనే అవుట్ డోర్ లో తీయబోతున్నారు. ఓ వారంలో ఇది పూర్తవ్వొచ్చట. తర్వాత చేతిలో ఉన్న పది రోజులు కంప్లీట్ గా దసరాకే ఇచ్చి నానితో పాటు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో పాల్గొనబోతోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దసరాలో కీర్తికి పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చాడట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఫస్ట్ హాఫ్ లో జాలీగా కనిపించే నాని ప్రీ ఇంటర్వెల్ నుంచి ఉగ్ర నరసింహావతారం ఎత్తేందుకు కారణమయ్యే కీలకమైన ఎపిసోడ్ లో ఈ ఇద్దరి పెర్ఫార్మన్స్ కు థియేటర్లలో చప్పట్లు పడటం ఖాయమని అంటున్నారు. ఛార్ట్ బస్టర్ అయిన చమ్కీల అంగీ పాట స్క్రీన్ మీద అంతే గొప్పగా వచ్చిందని వినికిడి. తెలుగులో సోలోగా చేసిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటివి కనీస స్థాయిలో ఆడకపోవడంతో పాటు సర్కారు వారి పాట వల్ల ఏమంత ప్రయోజనం కలగకపోవడంతో కీర్తి ఆశలన్నీ దసరా మీదున్నాయి.
This post was last modified on March 14, 2023 11:28 am
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…