కంగనా రనౌత్‌కు తాప్సి అంటే ఎందుకు నచ్చదో తెలియదు. అదే పనిగా ఆమెను టార్గెట్ చేస్తూ ఉంటుంది. మామూలుగా స్టార్ కిడ్స్‌ను కంగనా లక్ష్యంగా చేసుకుంటూ ఉంటుంది. నెపోటిజం బ్యాచ్ మీద విమర్శలు చేస్తుంటుంది. ఆ విషయంలో చాలామంది నుంచి కంగనాకు మద్దతు కూడా వస్తూ ఉంటుంది.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, సొంత ప్రతిభతో స్టార్‌గా ఎదిగిన కంగనా.. బాలీవుడ్ బడా బాబుల్ని ఉతికారేయడం చాలామందికి నచ్చుతుంటుంది. కానీ తన లాగే కష్టపడి ఎదిగిన తాప్సిని అదే పనిగా ఎందుకు విమర్శిస్తుందో అర్థం కాదు.
కానీ తన గురించి ఎన్ని మాటలన్నా కూడా తాప్సి ఓపిక పడుతూనే వచ్చింది. కానీ ఈ మధ్య కంగనా మరీ శ్రుతి మించిపోవడం.. తనను బిగ్రేడ్ ఆర్టిస్టుగా పేర్కొనడం.. లేనిపోని విషయాలు తపకు ఆపాదించి విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఆమెకు ఒళ్లు మండినట్లే ఉంది.
ఇక కంగనాతో తాడో పేడో తేల్చుకోవడానికే ఆమె సిద్ధమైనట్లుంది. తనను బి-గ్రేడ్ హీరోయిన్‌గా పేర్కొనడంపై తాప్సి ఈ మధ్యే సెటైరికల్ ట్వీట్ వేసింది. స్కూల్లోనే కాక ఇక్కడ కూడా గ్రేడ్లు ఇస్తున్నారా అంటూ ఎద్దేవా చేసింది. అంతటితో ఆగకుండా.. కంగనా ద్వంద్వ ప్రమాణాల్ని బయటపెట్టే వీడియోను తాజాగా షేర్ చేసిందామె.
గతంలో ఆమె స్టార్ కిడ్స్ కి అనుకూలంగా మాట్లాడిన వీడియోలు బయటపెట్టి, కంగనాది మొత్తం హిపోక్రసి అని విమర్శించింది. దీని మీద స్పందించిన నెటిజన్లకు కూడా ఘాటుగా బదులిచ్చిందామె. ఐతే తాప్సి సైలెంటుగా ఉన్నప్పుడే ఆమెను విడిచిపెట్టని కంగనా.. ఇప్పుడు ఊరుకుంటుందా? తన కెరీర్ లో క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ మరియు మణికర్ణిక వంటి సోలో హిట్స్ ఉన్నాయని.. అలాంటి ఒక సోలో హిట్ తను కొట్టి చూపించాలని తాప్సికి సవాలు విసిరింది.
ఐతే పైన చెప్పుకున్న సినిమాల్లోనూ హీరోల పాత్రలున్నాయి. వాటి ప్రాధాన్యం తక్కువ. అలాగే తాప్సి సైతం నామ్ షబానా, పింక్, బద్లా, తప్పడ్ లాంటి హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాలతో సత్తా చాటింది. కాబట్టి కంగనా వ్యాఖ్యలకు ఆమె దీటుగా బదులిస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 28, 2020 4:57 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…