మనం ఎంత గొప్ప సినిమా తీశామన్నది ముఖ్యం కాదు. దాన్ని ఎంత ఎక్కువ ప్రేక్షకులకు, దేశాలకు చేరవేశామన్నది కీలకం. ఒకప్పుడు విశ్వనాథ్ గారి అద్భుత చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, స్వయంకృషి లాంటివి విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి గౌరవం దక్కించుకున్నాయి కానీ అంతకు మించి ఆస్కార్ నామినేషన్ల దాకా ఏవీ వెళ్ళలేదు. అలా అని గొప్ప సినిమాలు రాలేదని కాదు. ఎన్నో వచ్చాయి. టి కృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఎందరో ఉద్దండులు సామాజిక అంశాల మీద ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ అవేవీ ప్రపంచం మొత్తానికి తెలియదు.
కానీ రాజమౌళి చరిత్ర తిరగరాసి చూపించాడు. ఆర్ఆర్ఆర్ ను విదేశీయులు సొంతం చేసుకోవడం చూసి ఆలోచించాడు. అందులో ఎమోషన్ భాషతో సంబంధం లేకుండా ఎక్కడో యుకె లండన్ లాంటి దేశాల్లో కనెక్ట్ అవ్వడం చూసి నమ్మకం పెంచుకున్నాడు. అమెరికాలో ప్రీమియర్లు వేస్తుంటే హౌస్ ఫుల్స్ కావడం గమనించాడు. థియేటర్ల లోపల నాటు నాటుకి డాన్స్ చేయడం చూసి ధీమాగా ముందుకెళ్ళడం మొదలుపెట్టాడు. దానికి తగ్గ గొప్ప ఫలితమే ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తోంది. జక్కన్నా నీకు సాటి ఎవరన్నా అంటూ అభిమానులు పొగడ్తల కోసం మాటలు వెతుకుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి ఇప్పటి జనరేషన్ తో పాటు రాబోయే తరం దర్శకులకు ఒక మార్గదర్శకత్వం చేశారు. ఒరిజినాలిటీకి నేటివిటీకి కట్టుబడితే ఆస్కార్ అయినా సలామ్ కొడుతుందని చాటి చెప్పాడు. ఆ పాటలో ఎలాంటి ఇంగ్లీష్ పదాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే మన పిల్లలకే అంత సులభంగా అర్థం కాని కొన్ని తెలుగు మాటలున్నాయి. అయినా ఫారినర్స్ ఊగిపోయారు. కీరవాణి పాటలో ఉన్న ఆత్మ గొప్పగా పండింది. చంద్రబోస్ సాహిత్యం ప్రత్యేక పాత్ర పోషించింది. ఇప్పుడు ఎందరికో ధైర్యం వచ్చింది. ఆస్కార్ కలలోనే కాదు నిజం చేసుకోవడానికీ దారి ఉందని జక్కన్నను చూసి నేర్చేసుకున్నారు.
This post was last modified on March 13, 2023 10:41 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…