కొణిదెల నిహారికను చూస్తే మెగా అభిమానులకు అయ్యో అనిపించకుండా ఉండదు. ఎన్నో రోజులు ఓపిక పట్టి, తమ కుటుంబ పెద్దలందరినీ కష్టపడి ఒప్పించి కథానాయిక అవతారం ఎత్తిందామె. కానీ ఆమెకు ఇక్కడ అదృష్టం కలిసి రాలేదు. నాలుగేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేస్తే ఆ నాలుగూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరోతో కలిసి ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే డార్క్ కామెడీ మూవీలో నటించింది. ఆ చిత్రమూ ఫ్లాపే అయింది. కట్ చేస్తే తిరిగి టాలీవుడ్ కు వచ్చి ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చేసింది. అదీ డిజాస్టరే. ఇక చివరగా చేసిన ‘సూర్యకాంతం’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఈ దెబ్బతో ఆమె సినీ కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయింది.
ఈ మధ్యే నిహారికకు పెళ్లి కూడా కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేయబోతున్నారు. పెళ్లి కూడా ఈ ఏడాదే ఉండొచ్చు. కాబట్టి ఇక నిహారిక నటనకు టాటా చెప్పేసినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఐతే నిహారిక సినీ కెరీర్ ముగిసిపోయి ఉండొచ్చు కానీ.. నటనకు మాత్రం గుడ్ బై చెప్పట్లేదని సమాచారం.
తొలిసారిగా ఆమె మెగా ఫ్యామిలీ బేనర్లో నటించబోతోందని.. అది ఒక వెబ్ సిరీస్ అని వార్తలొస్తున్నాయి. చిరంజీవి పెద్ద కూతురు సుశ్మిత ఇటీవలే సొంత బేనర్ పెట్టి వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలి ప్రాజెక్టును ఆల్రెడీ సేల్ కూడా చేసేసిందామె. దీని తర్వాతి ప్రాజెక్టును నిహారికతో చేయనుందట. నిహారికకు పరిచయం ఉన్న ఓ యువ దర్శకుడు దాన్ని డైరెక్ట్ చేస్తాడట. పెళ్లి తర్వాత ఆమె ఇందులో నటిస్తుందని అంటున్నారు. సినిమాలు లేకపోయినా.. ఇలా అయినా కెరీర్ కొనసాగించాలని మెగా అమ్మాయి ఫిక్సయినట్లుంది.
This post was last modified on July 28, 2020 2:22 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…