మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ను రీమేక్ రీమేక్ చేస్తున్నారన్న సమాచారం బయటికి వచ్చినపుడు పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. ఎందుకంటే భాషల మధ్య అంతరాలు చెరిగిపోయిన డిజిటల్ యుగంలో అందరూ అన్ని భాషల సినిమాలూ చూసేస్తున్నారు.
పైగా ‘లూసిఫర్’ తెలుగులోకి కూడా అనువాదం అయింది. థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత అమేజాన్‌లోకి కూడా వచ్చింది. ఇక ఈ సినిమా ఏమైనా కొత్తగా ఉంటుందా అంటే అదీ లేదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఇలాంటివి తెలుగులో కూడా చాలానే వచ్చాయి. అయినా సరే.. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి, రామ్ చరణ్ రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు చిరంజీవి కొన్ని నెలల కిందట స్వయంగా వెల్లడించాడు. అందరూ అతడికే ఫిక్సయిపోయారు.
కానీ ఇప్పుడు సుజీత్‌ను తప్పించిన వినాయక్‌ను ఓకే చేసినట్లు చెబుతున్నారు. మెగా కాంపౌండ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సుజీత్ ‘సాహో’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొని ఉండొచ్చు కానీ.. అతను కొత్త ఆలోచనలున్న దర్శకుడు. స్టైలిష్ ఫిలిం మేకర్. రీమేక్ అయినా సరే.. దానికి తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.. ఏదో కొత్తదనం, ఒరిజినల్‌తో పోలిస్తే మార్పు చూపిస్తాడని ఆశించారు.
కానీ అతణ్ని తప్పించి.. పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన వినాయక్‌ను తీసుకొచ్చారు. ఒకప్పుడు ‘ఠాగూర్’ రీమేక్‌తో వినాయక్ సత్తా చాటాడు. కానీ ‘ఖైదీ నంబర్ 150’కి వచ్చేసరికి సాధారణంగా మారిపోయాడు. చిరు రీఎంట్రీ మూవీ, ఒరిజినల్లో దమ్ముండటంతో ఆ సినిమా ఆడేసింది కానీ.. అందులో వినాయక్ ఘనతేమీ లేదు.
అతడి చివరి సినిమా ‘ఇంటిలిజెంట్’ చూశాక చిరు మళ్లీ అవకాశం ఇస్తున్నాడంటే ఆశ్చర్యమే. వినాయక్ ఒక జిరాక్స్ కాపీ తీసి చేతిలో పెట్టడం మినహా చేసేదేమీ ఉండకపోవచ్చు. అందుకే ఈ రీమేక్ విషయంలో ఉన్న కాస్త ఆసక్తి కూడా పోయినట్లే.
This post was last modified on July 28, 2020 4:55 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…