ఎవరైనా స్టార్ హీరో సినిమాలో అంతే స్టేచర్ ఉన్న మరో స్టార్ క్యామియో చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఫ్యాన్స్ అసంతృప్తి గురవ్వడమే కాక ఇమేజ్ మీద కూడా మరక పడుతుంది. పవర్ ఫుల్ రోల్ పడితే తప్ప ఎస్ చెప్పకూడదు. పెదరాయుడులో రజనీకాంత్ రేంజ్ లో ఉంటే ఎవరైనా ఓకే అంటారు. బన్నీ ఇలాంటి విషయాల్లో అసలు తొందరపడడు. గుణశేఖర్ రుద్రమదేవిలో టైటిల్ రోల్ అనుష్కదే అయినప్పటికీ గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కున్న చారిత్రక ప్రాధాన్యం గుర్తించి ఒప్పుకున్నాడు. ఆ సక్సెస్ లో తన పాత్రే కీలకం.
తాజాగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ లో ఆఫర్ చేసిన ఒక ప్రత్యేక పాత్రను బాగా అలోచించి అల్లు అర్జున్ ఫైనల్ గా చేయలేనని చెప్పేశాడు. ఒకవేళ పుష్ప 1తో ప్యాన్ ఇండియా మార్కెట్ రాకపోయి ఉంటే ఓకే అనేవాడేమో కానీ ఇప్పుడలా కాదు. మంచి స్కోప్ ఉన్నప్పటికీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు ఆ హెయిర్ స్టైల్ ని ఇంకెందులోనూ వాడకూడదని కఠిన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ ప్లస్ గా మారింది. కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా ఇలాంటి కారణాలతోనే వద్దనుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తొందరపడకపోవడమే మంచిదైంది.
ఫైనల్ గా వీళ్ళ స్థానాల్లో సంజయ్ దత్ లాకైనట్టు ముంబై అప్డేట్. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతోంది. తన లాంటి ఏజ్డ్ హీరోతో చేయిస్తుంటే బన్నీ నో చెప్పడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఆట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ లో నయనతార హీరోయిన్ కాగా మెయిన్ విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. కీలక భాగం షూట్ ప్రస్తుతం జరుగుతోంది. పఠాన్ వెయ్యి కోట్లు సాధించడం చూశాక ముందు జూన్ లో అనుకున్న జవాన్ రిలీజ్ ని నిరవధికంగా వాయిదా వేశారు. దసరా లేదా దీపావళి బరిలో దింపాలని చూస్తున్నారు. బిజినెస్ పరంగా దీనికి క్రేజ్ భారీగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates