టాలీవుడ్లో హడావుడి పడకుండా.. బాగా ఆలోచించి.. ఆచితూచి.. మంచి కాంబినేషన్లు సెట్ చేసుకుని సినిమాలు చేసే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అందుకేనేమో.. అతడి సక్సెస్ రేట్ చాలామంది హీరోలతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ‘నా పేరు సూర్య’తో చేదు అనుభవం ఎదుర్కొన్నాక బన్నీ.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన ‘అల వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
దీని తర్వాత తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ‘పుష్ప’ చేస్తున్నాడు అల్లు హీరో. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనివార్య కారణాలతో కొంచెం ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లబోతోందీ చిత్రం. ఈ మధ్య దొరికిన విరామంలో బన్నీ.. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్‌కు ఓకే చేసుకున్నట్లు సమాచారం.
కమర్షియల్ సినిమాలకు తనదైన ‘సోషల్’ టచ్ ఇచ్చి వరుస విజయాలందుకున్న కొరటాల శివతో పని చేయాలని బన్నీ ఆసక్తితో ఉన్నాడు. లాక్ డౌన్ టైంలో ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయి.. తర్వాత అవి కథా చర్చల దశకు కూడా వెళ్లాయని.. ఇటు బన్నీ ‘పుష్ప’ చిత్రాన్ని, అటు కొరటాల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశాక కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం.
ఈ చిత్రంలో బన్నీ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తాడని.. రాజకీయాలు, సామాజిక అంశాల చుట్టూ కథ నడుస్తుందని.. కొరటాల మార్కు కథాంశానికి బన్నీ పవర్ కూడా తోడైతే సినిమా రేంజే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రానికి నిర్మాత ఖరారవ్వలేదు. సబ్జెక్టుపై మంచి గురి ఉంటే.. అల్లు అరవిందే రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
This post was last modified on July 29, 2020 2:38 pm
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచుగా పెద్ద పెద్ద వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదంతా…