వరస సినిమాలు చేయడం కాదు వాటిలో కనీసం సగమైనా సక్సెస్ ట్రాక్ ఎక్కితే కెరీర్ ని చక్కగా ముందుకు తీసుకెళ్లొచ్చు. కానీ ఆది సాయికుమార్ కు టైం ఎంత మాత్రం కలిసి రావడం లేదు. గత ఏడాది అయిదు రిలీజులు ఎవరికీ లేవు. కానీ తనకు పడ్డాయి. అయితేనేం ఒక్క హిట్టు దక్కలా. తాజాగా నిన్న సిఎస్ఐ సనాతన్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో శ్రీనివాస్, అజయ్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు కనీస పబ్లిసిటి కరువవ్వడంతో ఓపెనింగ్స్ మరీ వీక్ గా మొదలయ్యాయి. ఇంతకీ మూవీ టాక్ ఏంటనేగా మీ డౌట్.
లైన్ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశారు. బిజినెస్ మెన్ విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నాడ)ను ఎవరో చంపేస్తారు. అతనికి సంబంధం ఉన్న అందరి మీద అనుమానం వస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు సిఎస్ఐ(క్రైమ్ సైట్ ఇన్వెస్టిగేషన్) ఆఫీసర్ సనాతన్. క్లూలు సేకరిస్తూ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తాడు. ఆఖరికి చిన్న ట్విస్టుతో మర్డర్ చేసిన వాణ్ణి పట్టుకుంటాడు. రాక్షసుడు, హిట్ లాంటివి చూసి బాగా అప్డేట్ గా ఉన్న ఆడియన్స్ కి ఏదో కొత్తగా డిఫరెంట్ గా చెప్పనిదే థియేటర్లకు రప్పించలేం.
కానీ శివశంకర్ దేవ్ అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. టైటిల్ కార్డుతో మొదలుపెట్టి సన్నివేశాలన్నీ అతి మాములుగా జరుగుతాయి. ఎక్కడా ఆసక్తి రేపే టెంపో ఉండదు. అవసరం లేని ల్యాగ్ తో చూసేవాళ్ల సహనానికి పరీక్ష మొదలవుతుంది. దానికి తగ్గట్టే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉండి దెబ్బ కొట్టాయి. అలీ రెజా, మిషా నారంగ్, నందిని రాయ్ ఇలా ఆర్టిస్టులను బాగానే తీసుకున్నా దానికి తగ్గ స్టోరీ సెటప్ లేకుండా పోయింది. అసలే వీక్ ప్రమోషన్లతో సతమతమవుతున్న సనాతన్ కు రిపోర్ట్స్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఆది సాయికుమార్ బ్యాడ్ లక్ కి ఇంక బ్రేకులు పడనట్టే.
This post was last modified on March 11, 2023 1:58 pm
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…