ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో క్లారిటీ రావడంతో అప్పటికప్పుడు స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేయించి మరీ సెట్స్ పైకి తీసుకెళ్లారట. సమ్మర్ రిలీజ్ వాయిదా పడటంతో దసరా లేదా దీపావళిని లక్ష్యంగా పెట్టుకుని చిత్రీకరణ జరుపుతున్నారు. నెక్స్ట్ ఎవరితో చేస్తారనే విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది కానీ తాజాగా వచ్చిన లీక్ మేరకు బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్ జరిగిపోయిందట.
దాని ప్రకారం కార్తీకి గత ఏడాది సర్దార్ రూపంలో మంచి హిట్ ఇచ్చిన పీఎస్ మిత్రన్ తో చేయడానికి చిరు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్లకు సోషల్ మెసేజ్ జోడించి తీయడంతో మిత్రన్ కి మంచి పేరుంది. విశాల్ కు అభిమన్యుడు ఇచ్చింది ఇతనే. అయితే కథ మన టాలీవుడ్ రైటర్ బివిఎస్ రవి అందించబోతున్నట్టు మరో న్యూస్. ఇక్కడే ఇంకో ట్విస్టు ఉంది. ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి కనీస హిట్టు లేక ఇబ్బందిపడుతున్న కూతురు సుస్మిత కొణిదెల కోసమే చిరంజీవి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ మధ్య మెగా కాంపౌండ్ ఎక్కువగా తమిళ దర్శకులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సముతిరఖనితో ఆల్రెడీ వినోదయ సితం రీమేక్ కోసం చేతులు కలిపాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ కోసమే ఇరవై ఏళ్ళ తర్వాత మోహన్ రాజా చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. రామ్ చరణ్ కోసం లోకేష్ కనగరాజ్ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు మిత్రన్ వంతు వస్తోంది. డివివి దానయ్య నిర్మాతగా వెంకీ కుడుములతో ఎప్పుడో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు రద్దయిపోయిన సంగతి తెలిసిందే. ఇంకో వారం పది రోజుల్లో మెగా 156కి సంబంధించిన పూర్తి వివరాలు రావొచ్చు.
This post was last modified on March 11, 2023 11:41 am
మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…
ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…
స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…
ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…