భారతీయుల దృష్టి మునుపెన్నడూ లేని స్థాయిలో ఈసారి ‘ఆస్కార్’ అకాడమీ అవార్డుల మీద నిలిచి ఉంది. అందుక్కారణం.. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పురస్కారానికి గట్టి పోటీదారుగా మారడమే. తుది జాబితాలో చోటు సంపాదించిన ఈ పాటకు.. ఆస్కార్ అవార్డు రావడం పక్కా అనే నమ్మకంతో టీం ఉంది. అవార్డుల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీంలోని ప్రధాన వ్యక్తులు హాజరవుతుండడం.. వాళ్లు రెడ్ కార్పెట్ మీద నడవబోతుండటమే పెద్ద గౌరవంగా భావిస్తున్నారు.
ఇక అవార్డుల వేడుకలో కీరవాణి తన టీంతో కలిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండడం కూడా ఖరారైంది. కాగా ఇదే వేదిక మీద హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ కూడా ఇస్తారనే అంచనాలతో అభిమానులు ఉన్నారు. ఈ దిశగా వార్తలు కూడా వచ్చాయి.
కానీ ఈ వేడుక ముంగిట ఓ హాలీవుడ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తారక్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఆస్కార్ వేదిక మీద నాటు నాటు స్టెప్పులు చూడడం సందేహంగానే ఉంది. మీ లైవ్ పెర్ఫామెన్స్ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు తారక్ సమాధానం చెబుతూ.. అందుకు అవకాశం లేనట్లే మాట్లాడాడు. “మేం ఆ పాటకు డ్యాన్స్ చేస్తామని కచ్చితంగా చెప్పలేం. నాకు, రామ్ చరణ్‌కు రిహార్సల్స్ చేసే సమయం లేదు. అందుకే మేం ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ చేయడం అనుమానమే. కానీ ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి” అని తారక్ అన్నాడు.
ఐతే తారక్, చరణ్ నిజంగానే ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ చేయరా.. లేరంటే ముందు ఇలా చెప్పి సర్ప్రైజ్ లాగా డ్యాన్స్‌తో అలరిద్దామనే ఉద్దేశంతో తారక్ ఆ మాట అన్నాడా అన్నది తెలియదు. కానీ ఆస్కార్ వేదిక మీద తారక్, చరణ్ డ్యాన్స్ చేస్తే మాత్రం అది భారతీయులు గర్వించే మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 10, 2023 7:14 pm
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…