నటి పవిత్రతో యాక్టర్ నరేష్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న విషయం వారి కుటుంబంతో పాటు యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఈ మధ్యే వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకుంటూ ఓ వీడియో వదిలాడు నరేష్. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం మీ ఆశీస్సులు కావాలని చెప్పుకున్నాడు. నరేష్ త్వరలోనే పవిత్రను పెళ్లాడబోతుండటం పైగా కిస్ పెట్టుకొని వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు వీకే నరేష్. పవిత్ర, తను మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యామని చెప్తూ ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ ఇంత సైలెంట్ గా ఎలా పెళ్లి చేసుకున్నారని ? అందరూ మాట్లాడుకుంటున్నారు.
నిజానికి ఈ వీడియోస్ వెనుక పెద్ద ప్లానే ఉంది. నరేష్ , పవిత్ర లోకేష్ జంటగా ఓ ప్రేమ కథ తెరకెక్కుతుంది. వీరిద్దరి నిజ జీవితాన్ని కథగా మార్చి స్క్రీన్ మీదకు తీసుకొచ్చే సినిమా రెడీ అవుతుంది. దానికి సంబంధించి ఇంకా డీటైల్స్ బయటికి రాలేదు కానీ ఈ ముద్దు , పెళ్లి ఇవన్నీ ఆ సినిమాలోనివే. వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ను వాడుకునే ప్రయత్నంగా వస్తున్న సినిమా ఇది.
ఇక నరేష్ , పవిత్ర లోకేష్ ఎలా కలిశారు ? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది ? తర్వాత సహజీవనం ఇలా నరేష్ , పవిత్రల కథతోనే సినిమా రాబోతుంది. దానికోసమే నరేష్ ఇలా హాట్ టాపిక్ అయ్యే వీడియోస్ రిలీజ్ చేస్తున్నాడు. త్వరలోనే ఇవన్నీ సినిమా కోసమని ప్రకటించి అందరినీ ఫూల్స్ చేసి సినిమా చూడండి అనే చెప్పే ప్లానింగ్ లో ఉన్నాడు.
This post was last modified on March 10, 2023 12:18 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…